‘తేరి’ సెన్సార్ ఇంకా పూర్తి కాలేదా?

తమిళ నటుడు విజయ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తేరి’. ఈ చిత్రం తెలుగులో పోలీసోడు పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘యూ’ సర్టిఫికేట్ పొందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డుకు అప్లికేషన్ మాత్రమే ఇచ్చామని, త్వరలోనే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంటుందని ఆయన తెలిపారు. ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ లు జంటగా నటిస్తున్నారు. జి‌వి ప్రకాష్ అందించిన గీతాలకు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం తమిళ సంవత్సరాది పురస్కరించుకోని ఏప్రిల్ 14 న ఈ చిత్రం విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus