Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » Thank You Movie: ‘థాంక్యూ’ మూవీ గురించి నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు..!

Thank You Movie: ‘థాంక్యూ’ మూవీ గురించి నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు..!

  • July 18, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thank You Movie: ‘థాంక్యూ’ మూవీ గురించి నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు..!

అక్కికేని నాగ చైత‌న్య హీరోగా ‘శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ల నిర్మాణంలో రూపొందిన ‘థాంక్యూ’ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మనం’ తర్వాత విక్రమ్ కె.కుమార్ – చైతన్య కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది.2009 లో వచ్చిన ‘జోష్’ తర్వాత .. దాదాపు 13 ఏళ్ళ తర్వాత చైతన్య- దిల్ రాజు కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది.జూలై 22న ‘థాంక్యూ’ విడుదల కాబోతుంది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.తాజాగా నిర్మాత దిల్ రాజు ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ప్ర. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. ఏ సినిమాని కూడా మీ రియల్ లైఫ్ తో పోల్చుకోలేదు. ఈ సినిమాతో పోల్చుకున్నారు? అంతలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి?

దిల్ రాజు : నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలను నా లైఫ్ తో పోల్చుకోలేదు. ఇప్పుడు ‘థాంక్యూ’ ని పోల్చుకున్నాను. రైటర్‌ రవి 4 ఏళ్ళ క్రితం నాకు ఈ స్టోరీని నెరేట్‌ చేశారు. నాకు అందులో పాయింట్‌ బాగా నచ్చింది. లైఫ్‌లో థాంక్యూ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. ఎక్కడో స్టార్ట్ అయిన నా లైఫ్‌లో ఆటో మొబైల్స్ నడుపుతున్నప్పుడు, ఎడ్యుకేషన్‌ టైమ్‌లోగానీ, డిస్ట్రిబ్యూటర్‌గా టర్న్ అయినప్పుడు గానీ, నిర్మాతగా గానీ చాలా మంది హెల్ప్ చేశారు. సొసైటీకి దిల్‌రాజుగా కనిపిస్తున్నా. నా జర్నీలో నాకు గుర్తుండో, గుర్తులేకనో నాకు చాలా మంది హెల్ప్ చేసుంటారు. ఇప్పుడు ఆగి వాళ్లను కలిసొస్తే, నా ఎమోషన్స్ , వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేదే కథ. ఈ పాయింట్‌కి నేను కనెక్ట్ అయ్యాను. ఉదాహరణకి.. ఒక డ్రైవర్‌ ఉన్నాడు. ఎక్కడో పని చేస్తుంటాడు. ఇంకొకడు ఇంకో ఆఫర్‌ ఏదో చెప్పి ఉండవచ్చు. ఆ పర్సన్‌ని నిజంగా గుర్తుపెట్టుకుని వాడిని కలిసి, ఫోన్‌ చేసి థాంక్యూ అని చెబితే ఎంత అద్భుతంగా ఉంటుందా ఫీలింగ్‌ అనిపించింది. అప్పుడు నేను కనెక్ట్ అయ్యి సినిమాగా చేయాలనుకున్నా. అలా ఓ హీరో కేరక్టర్‌ రాయాలనుకున్నాం. అప్పుడు రవితో కూర్చుని కేరక్టర్‌ని అనుకున్నాం.

ప్ర. కథగా మారుస్తున్నప్పుడు మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారా?

దిల్ రాజు : ఆ కేరక్టర్‌కి గతం చెప్పాలనుకున్నాం. కాలేజ్‌, టీనేజ్‌, లైఫ్‌… అన్నిటినీ డిజైన్‌ చేశాం. రవి ఐడియాని మేం అందరం కూర్చుని డిజైన్‌ చేసి మంచి కథగా చేశాం. ఈ కథని మామూలుగా చెబితే డాక్యుమెంటరీ అనే ఫీలింగ్ వస్తుంది. అలా రాకూడదు అనే డిస్కషన్స్ ఎక్కువ జరిపాం.

ప్ర. దర్శకుడు విక్రమ్ కుమార్ గారు చాలా వరకు తన సొంత కథలతో సినిమాలు చేశారు. అలాంటిది ఆయన ఈ ప్రాజెక్టు లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

దిల్ రాజు : ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? అని ఆలోచించాం. ఇద్దరు, ముగ్గురు డైరక్టర్ల పేర్లు అనుకున్నాం. అప్పుడు నాకు విక్రమ్‌ గుర్తొచ్చాడు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా ప్రివ్యూ చూడ్డానికి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాను.ఆ సినిమా నైజాం ఏరియాకి నేనే డిస్ట్రిబ్యూటర్.సినిమా స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు విక్రమ్‌కి ఈ పాయింట్‌ చెప్పాను. విక్రమ్‌ కూడా ఎగ్జయిట్‌ అయ్యాడు.స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్‌ స్టైల్‌లో రాయమని చెప్పాను. ఇది 2019లో జరిగింది.పాండమిక్ టైంలో నేను కూడా థాంక్యూ జర్నీ స్టార్ట్ చేశా.

నాకు స్కూల్లో హెల్ప్ చేసిన వారిని, ఆటోమొబైల్స్ లో హెల్ప్ చేసిన వారిని అందరినీ కలిశా. ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేయాలి. 50 ఫిలిమ్స్ వరకు కంటిన్యూ చేయాలి నేను. అదే నా విజన్‌. సినిమా రిలీజకన్నా ముందే కంప్లీట్‌ చేయాలి. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. నా జర్నీలో నేను కాస్ట్యూమ్స్ కృష్ణ వరకు వచ్చాను. పెళ్లి పందిరి సినిమా సక్సెసే నన్ను నిలబెట్టింది. నా లైఫ్‌ లాంగ్‌ నేను దాన్ని మర్చిపోను. అవన్నీ ఫోటోలు, వీడియో లాగా రెడీ చేస్తున్నా. అక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో థాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నా.

ప్ర. కథ విషయంలో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారా?

దిల్ రాజు : ఈ కాన్సెప్ట్ ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్‌ అయ్యాం. ఎందుకంటే జనాలు ఆడిటోరియానికి రావడానికి క్యారెక్టర్‌ కు కనెక్ట్ కావాలి, అందుకే ఎక్కువ స్ట్రగుల్‌ ఫేస్‌ చేశాం.ఒక నార్మల్‌ కుర్రాడు, ఒక లెజెండరీ అయ్యాడు. అతను మొత్తం నాది అని అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీస్‌, కమర్షియల్‌ యాంగిల్స్ అన్నీ కలిపితే ఈ సినిమా.ఈ సినిమాను డిజైన్‌ చేయడం బిగ్‌ జర్నీ. ‘ప్రేమమ్‌’లాగా మూడు స్టోరీలున్నాయి. ‘ఆటోగ్రాఫ్‌’ లా ఉంది అని అనడం కూడా విన్నాను.కానీ ఇది వేరు

ప్ర. ‘ప్రేమమ్’ లో కూడా చైతన్య హీరో? అందరూ దానికి కనెక్ట్ అవుతారు అనిపించలేదా?

దిల్ రాజు : ‘ప్రేమమ్‌’ లో లవ్‌ స్టోరీస్‌ చెప్పారు. కానీ మాది లైఫ్‌ స్టోరీ. టీనేజ్‌లో ఈయనకు లైఫ్‌లో ఏం జరిగింది? కాలేజ్‌లో స్టోరీ ఏం జరిగింది? జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్‌.నేను మా సినిమా కథను ఎక్కడా హైడ్‌ చేయడం లేదు. స్టోరీ చెప్పేస్తున్నా. ఇప్పుడు గతం గురించి ఆలోచించే టైమ్‌ ఎవరికీ లేదు.

ప్ర. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ గారిని డైరెక్టర్ గా తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది?

దిల్ రాజు : విక్రమ్‌ ‘మనం’ని చాలా అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. మామూలుగా అయితే ‘మనం’ కథ వినేటప్పుడు కన్‌ఫ్యూజ్‌ అవుతాం. అయినా చాలా అర్థం చేసుకుని చేశాడు. విక్రమ్‌తో మాట్లాడుతున్నప్పుడు చైతన్య అయితే ఎలా ఉంటాడు? అని అన్నాడు. నాకు సూపర్‌ అనిపించింది. చైతన్యని నేను కలిసినప్పుడు వెంటనే ఓకే అన్నాడు. మూడు లుక్స్ కి రెడీ కావాల్సిన క్యారక్టర్‌ అయినా వెంటనే ఓకే చెప్పాడు. విక్రమ్‌కి, చైతూకి ఉన్న కెమిస్ట్రీతో మేం అందరం ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాం. చైతన్య ఎక్స్ ట్రార్డినరీ జాబ్‌ చేశాడు.

ప్ర. విక్రమ్ కుమార్ తీసిన సినిమాలు ఈ మధ్య కాలంలో అతగా ఆడలేదు? మరి ఈ సినిమాకి ఆయన్ని తీసుకోవడం రిస్క్ అనిపించలేదా?

దిల్ రాజు : విక్రమ్‌ తీసిన ‘ఇష్క్’, ‘మనం’, ’13బీ’.. సక్సెస్‌ఫుల్‌ ఫిల్మ్స్. అవన్నీ డిఫరెంట్‌ కాన్సెప్ట్స్. ‘హలో’ లో లవ్‌స్టోరీ బావుంటుంది. కానీ ఎక్కడో ఆడియన్‌కి రీచ్‌ కాలేదు. ‘గ్యాంగ్‌లీడర్‌’ కూడా అంతే. అవన్నీ విక్రమ్‌తో మాట్లాడాను. ఇప్పుడు ‘థాంక్యూ’ 100 శాతం ఆడిటోరియానికి రీచ్‌ కావాలంటే నేను ఈ సినిమాతో జర్నీ చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాను. టీమ్‌ డిస్కషన్‌కి తనని ఒప్పించాను. కొన్నిసార్లు ఎక్కడో ఇబ్బంది పడ్డాడు. అయినా నేను నచ్చజెప్పాను. షూటింగ్‌, ఎడిటింగ్‌ ప్రాసెస్‌లో ఇలాగే పనిచేశాం. ప్రతిచోటా టీమ్‌ వర్క్, హోమ్ వర్క్ లాగా చేశాం.

ప్ర. విక్రమ్ ఈ కథని ఎలా హ్యాండిల్ చేశాడు అనుకుంటున్నారు?

దిల్ రాజు : 90 పర్సెంట్‌ విక్రమ్‌ మా అంచనాలను రీచ్‌ అయ్యాడు.నేను ప్రతి డైరక్టర్‌తో ఇలాగే చెప్తాను. కానీ కొందరు డైరక్టర్లు వింటారు. కొందరు తామే రైట్‌ అని అంటారు. వాళ్లు రైట్‌ అన్నప్పుడు మాత్రం వదిలేస్తాను. డిస్కషన్‌ మాత్రం కచ్చితంగా చేస్తాను. డిస్కషన్‌ వల్ల వాళ్ల మైండ్‌లో ఏదో ఒక క్వశ్చన్‌ రన్‌ అవుతుంటుంది. ఫైనల్‌గా నేను తప్పయితే యాక్సెప్ట్ చేస్తాను. స్టిల్‌ అలాగే అనిపిస్తే మాత్రం ఇంకోసారి చూసుకోమని చెప్తాను. పెద్ద డైరక్టర్ల ఎక్స్ పీరియన్స్ లు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్‌ టు పాయింట్‌ రాసిస్తాను. దానికి రీచ్‌ అవుతున్నామా లేదా? అని చెక్‌ చేస్తాను. మిడ్‌ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను.

ప్ర. పీసీ శ్రీరామ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

దిల్ రాజు : పీసీగారు కూడా ఈ సినిమా జర్నీని నమ్మారు. డీఐ చేసేటప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్‌ చేసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

ప్ర. ఇప్పుడు జనాలు థియేటర్ కు రావడం తగ్గించారు? మీ సినిమా పై ఆ ప్రభావం ఎంత వరకు పడుతుంది అనుకుంటున్నారు..?

దిల్ రాజు : ప్యాండమిక్‌ ముందు, ప్యాండమిక్‌ తర్వాత టోటల్‌ ఈక్వేషన్స్, మైండ్‌సెట్స్ మారిపోయాయి. అంతకు ముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు ఆడియన్స్. ప్యాండమిక్‌లో ఇంట్లో కూర్చుని చాలా కంటెంట్‌ చూశారు. అప్పుడు చాలా ఎడ్యుకేట్‌ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కంటెంట్‌ నచ్చట్లేదు. దీనికోసం అంత డబ్బు పెట్టి వెళ్లాలా? అని అనుకుంటున్నారు.

ఈ విషయాల్లో మేం మారాల్సిన టైమ్‌ వచ్చింది.ఎలాంటి కంటెంట్‌ని ఇస్తున్నాం అనేది మెయిన్‌ పాయింట్‌. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో హీరోలు 3,4 సినిమాలు లాక్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఈ కంటెంట్లతో వచ్చే కథలు సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు మేం హోమ్‌ వర్క్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం.

ప్ర.త్వరలో జరగబోయే నిర్మాతల మీటింగ్ లో ఇటువంటి అంశాల పై చర్చ జరుగుతుందా?

దిల్ రాజు : మా నిర్మాతల మీటింగ్‌లో మేం ప్రధానంగా చూస్తున్నది మేం ఎడ్యుకేట్‌ కావాలనే విషయాన్నే. నాన్‌ థియేట్రికల్‌, థియేట్రికల్‌ ఎకానమీ మారిపోయింది. వాటి గురించి ఎడ్యుకేట్‌ కావాలనుకుంటున్నాం.గతంలో జులైలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ ఉన్నాయి మనకు. సింహాద్రి, తొలిప్రేమ, ఫిదా వంటి సినిమాలన్నీ జులైలో వచ్చాయి.

మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు.మేజర్‌, విక్రమ్‌ రెండు సినిమాలు జూన్‌ ఫస్ట్ వీక్‌లో వచ్చి ఎగ్జయిట్‌ చేశాయి. ఆడియన్స్ బయటికి వచ్చి బావుందని చెబితే సూపర్‌హిట్‌ అయ్యాయీ ఈ మూవీస్‌.ఆడియన్స్ ఎప్పుడూ తప్పుకాదు.

ప్ర : టికెట్ రేట్లు థియేటర్లకు జనాల్ని దూరం చేస్తున్నాయి అనుకోవచ్చా?

దిల్ రాజు : టికెట్‌ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా నా చేతిలో ఉండదు. అది ప్రొడ్యూసర్‌ కాల్‌. నా థాంక్యూని ఇప్పుడు 100 ప్లస్‌ జీయస్‌టీ ఇస్తున్నాం. మల్టీప్లెక్స్ లో 150 ప్లస్‌ జీయస్‌టి. ఇందులో 75 మల్టీప్లెక్స్ కి వెళ్తుంది. నాకు 75 వస్తుంది.తెలంగాణలో మినిమమ్‌ దగ్గర నుంచి మ్యాగ్జిమమ్‌ వరకు ఫ్లెక్సీ రేట్లున్నాయి. కానీ ఆంధ్రాలో 150 ప్లస్‌ జీయస్‌టీ అని జీవో ఇచ్చారు. ఒకసారి తగ్గిస్తే మళ్లీ దాని మీద మేం వర్క్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం.

ప్ర. హిందీలో మీరు చేసిన ‘జెర్సీ’ అంతగా కలెక్ట్ చేయలేదు. మరి ‘హిట్’ రీమేక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?

దిల్ రాజు : ‘జెర్సీ’ ప్యాండమిక్‌ లేకుంటే రూ.30 కోట్లు లాభం తెచ్చిపెట్టే సినిమా అయ్యేది. కానీ ఆ సినిమా రిలీజ్ డిలే అయ్యే కొద్దీ 30 రాదులే, 15 వస్తుందిలే అని అనుకున్నాం. ఇంకో స్టేజ్‌లో 10 అనుకున్నాం. రిలీజ్ డేట్లు మూడు సార్లు మార్చాల్సి వచ్చినప్పుడు లాభం లేకున్నా పర్వాలేదు కానీ, బయటపడితే చాలు అనుకున్నాం. ఫైనల్ గా 3-4 కోట్ల డ్యామేజ్‌తో బయటపడ్డాం. ఏమాత్రం ఓపెనింగ్‌ వచ్చినా చాలనుకున్నాం. హిట్‌ మాత్రం నిర్మాతల్ని బయటపడేసే సినిమా అవుతుంది.

ప్ర.నిర్మాతల మీటింగ్లో ఓటీటీల పై కూడా చర్చ జరుగుతుందా?

దిల్ రాజు : ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా, నష్టమే ఉంది. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజయితే ఆ ఎనర్జీ వేరు.సినిమా ఆడుతున్న కొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ వస్తుంది. సినిమా ప్యాషన్‌గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ ముఖ్యమే. ఎనర్జీ కూడా ముఖ్యమే. మైనస్‌లు తీసేసి, ప్లస్‌ల వైపు డ్రైవ్‌ చేయాలి.

ప్రొడ్యూసర్ల గురించి హీరోలకు కన్‌సర్న్ ఉంటుంది. వాళ్లకు అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్‌ చేయాలి. అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాం. సమస్యను అర్థమయ్యేలా చెబితే సరిపోతుందని నా ఫీలింగ్‌.

ప్ర. ఫైనల్ గా ‘థాంక్యూ’ ఎలా ఉంటుంది అంటే ఒక్క మాటలో ఏం చెబుతారు?

దిల్ రాజు : ‘థాంక్యూ’ అనేది ఒక సినిమా అనే కంటే ఇది అందరి లైఫ్.. అని చెప్పాలి.కచ్చితంగా అందరినీ ఒకసారి గతంలోకి తీసుకెళ్లే సినిమా. నాగ చైతన్య ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version