Vikram Collections: 13వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘విక్రమ్’….!

  • June 16, 2022 / 07:36 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి ‘విశ్వరూపం 2’ తర్వాత వచ్చిన చిత్రం ‘విక్రమ్’. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సూర్య కూడా ఈ చిత్రంలో రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేయడం జరిగింది. టాలీవుడ్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఇక జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 4 రోజులకే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.05 cr
సీడెడ్ 1.88 cr
ఉత్తరాంధ్ర 2.05 cr
ఈస్ట్ 1.09 cr
వెస్ట్ 0.72 cr
గుంటూరు 0.97 cr
కృష్ణా 1.06 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.33 cr

‘విక్రమ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4వ రోజుకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.14.33 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకి రూ.6.73 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. ‘మేజర్’ ‘ఎఫ్3’ ‘అంటే సుందరానికీ’ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ‘విక్రమ్’ ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తుండడం విశేషం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus