యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి ‘విశ్వరూపం 2’ తర్వాత వచ్చిన చిత్రం ‘విక్రమ్’. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య కూడా ఈ చిత్రంలో రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేయడం జరిగింది. టాలీవుడ్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఇక జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న విక్రమ్ నిన్న అంటే 7 రోజు అయిన గురువారం నాడు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 4.64 cr |
సీడెడ్ | 1.44 cr |
ఉత్తరాంధ్ర | 1.57 cr |
ఈస్ట్ | 0.85 cr |
వెస్ట్ | 0.57 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 0.80 cr |
నెల్లూరు | 0.41 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.03 cr |
‘విక్రమ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.11.03 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకి రూ.3.43 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది.
‘మేజర్’ ‘ఎఫ్3’ వంటి సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ‘విక్రమ్’ ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తుండడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ వారం నాని నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి.. ‘విక్రమ్’ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!