భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చియాన్ విక్రమ్ చిత్రం

గత సంవత్సరం ‘స్కెచ్’ చిత్రంతో తమిళ్ లో హిట్టు కొట్టాడు విక్రమ్.తెలుగులో మాత్రం ప్లాప్ గా నిలిచింది. తరువాత మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్లో చేసిన ‘సామి2’ కూడా ఘోరమైన డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ ప్రధాన పాత్రలో ‘మహావీర్ కర్ణ’ అనే తమిళ సినిమా తెరకెక్కనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ చిన్ననాటి పాత్రకు కాస్టింగ్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. దాంతో చియాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త షికారు చేసింది.

అయితే ఆ వార్తలకి చెక్ పెడుతూ… ఈ రోజు ఈ సినిమా తిరువనంతపురం .. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి జరుపుకుంది . సురేష్ గోపి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గతంలో విక్రమ్ – సురేష్ గోపి ‘ఐ’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుగానీ .. కొన్ని కారణాల వలన విక్రమ్ హాజరు కాలేకపోయాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, కర్ణాటక, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus