‘హనుమాన్’ విలన్ తో డేటింగ్లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది విమలా రామన్ (Vimala Raman). ఆ తర్వాత జగపతి బాబుతో (Jagapathi Babu) ‘గాయం 2’ ‘చట్టం’, శ్రీకాంత్ తో (Srikanth) ‘రంగ ది దొంగ’, సుమంత్ తో (Sumanth) ‘రాజ్’ (Raaj), తరుణ్ తో (Tarun Kumar) ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జునతో (Nagarjuna) ‘ఓం నమో వెంకటేశాయ’ (Om Namo Venkatesaya) వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. చెప్పుకోడానికి పెద్ద ఛాన్సులు వచ్చినా ఈమె ఖాతాలో సక్సెస్ పడింది అంటూ ఏమీ లేదు.

గతేడాది ‘రుద్రంగి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించింది కానీ ఈమె రీ ఎంట్రీని జనాలు పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమాలో కూడా నటించింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ మేకర్స్ ఈమెకి రోల్స్ ఆఫర్ చేయలేదు అని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా.. ‘హనుమాన్’ (Hanu Man) విలన్ అయినటువంటి వినయ్ రాయ్ తో (Vinay Rai) ఈమె డేటింగ్లో ఉన్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ జంట ఓ రొమాంటిక్ ఫోటో షూట్ తో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఈ ఫోటోలను విమలా రామన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి… వాటికి ‘వివి’ అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. దీంతో వారి రిలేషన్ షిప్ ను ఇప్పుడు అధికారికంగా ప్రకటించినట్టు అయ్యింది. వీరి రొమాంటిక్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus