విమలా రామన్ లో మరో కోణం!

వెండితెర పై అందాల తారగా వెలుగొందిన విమలా రామన్ తొలిసారి భక్తి రసా కథా చిత్రంలో నటిస్తోంది. అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న “ఓం నమో వెంకటేశాయ”లో ఆమె శ్రీదేవి (లక్ష్మి) గా కనిపించనుంది. పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు మంచి పాత్ర వచ్చినందుకు విమలా సంతోషంగా ఉంది. “నేను చిన్నప్పుడు భరత నాట్యం నేర్చుకున్నాను. పలు దేవాలయాల్లో పురాణం, ఇతిహాసాలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చాను.

మళ్లీ అలంటి పాత్రను “ఓం నమో వెంకటేశాయ”లో చేస్తున్నాను. అయితే ఇందులో నృత్యం చేయడం లేదు. ఎందుకంటే “మా లక్ష్మి దేవి డ్యాన్స్ చేయడం లేదు” అని డైరక్టర్ రాఘవేంద్ర రావు చెప్పారు” అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమలా రామన్ వివరించింది. అయినా తన క్లాసికల్ డ్యాన్స్ టాలెంట్ ని ఏదైనా సినిమాలో చూపిస్తానని చెప్పింది.  ఆ అది దేవుడు శివుడి పై సినిమా తీస్తే అందులో తాండవ నృత్యం  చేస్తానని తన కోరికను బయట పెట్టింది. హాట్ హాట్ గా అందాలు ఆరబోసే భామలో ఈ కోణం చూసి పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆమె కోరికను తీర్చుకునేందుకు ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus