Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • గీతానంద్, శ్రీహరన్ చోటు, రోణిత్ గర్గ్ (Hero)
  • మిత్రా శర్మ, అన్షులా ధావన్ (Heroine)
  • జెన్నిఫర్ ఇమ్మాన్యూల్ (Cast)
  • దయానంద్ (Director)
  • రాజా దారపునేని (Producer)
  • స్మరణ్ (Music)
  • వెంకట ప్రసాద్ (Cinematography)
  • మార్తాండ్ కె.వెంకటేష్ (Editor)
  • Release Date : జూలై 11, 2025
  • రాజ్ గురు ఫిలిమ్స్ (Banner)

ఈవారం విడుదలైన సినిమాల్లో కాస్తంత క్రేజ్ సంపాదించుకుని, థియేటర్లకు జనాల్ని రప్పించిన చిత్రం “వర్జిన్ బాయ్స్”. ప్రొడ్యూసర్ రాజా దారపునేని స్టెట్మెంట్స్ & స్టేజ్ ప్రెజన్స్ ఈ సినిమాకి కాస్త క్రేజ్ తీసుకొచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Virgin Boys Review in Telugu

కథ: ఆర్య (గీతానంద్), దుండి (శ్రీహాన్), రోణి (రోణిత్) జీవితంలో అమ్మాయి లేక, మొదటి అనుభవం కోసం ఆరాటపడుతుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేలోపు తమ వర్జినిటీ పోగొట్టుకుంటామని శపథం చేస్తారు. అందుకోసం వాళ్లు పడిన కష్టాలేమిటి? ఈ క్రమంలో వాళ్లు నేర్చుకున్న విషయాలేమిటి? అనేది “వర్జిన్ బాయ్స్” కథాంశం.

నటీనటుల పనితీరు: రోణిత్, అన్షులా ధావన్, జెన్నిఫర్ ఇమ్మాన్యుల్, మిత్రా శర్మ మినహా ఎవరూ సరైన నటనతో ఆకట్టుకోలేకపోయారు. రోణిత్ పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉండగా.. తెలుగమ్మాయిలు కాకపోయినా అన్షులా & జెన్నిఫర్ మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా ఆ ఇద్దరు తెలుగు డైలాగ్స్ కి సరైన లిప్ సింక్ ఇవ్వడం అనేది ప్రశంసార్హం.

గీతానంద్ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. ఇక శ్రీహాన్ ఓవర్ యాక్షన్ కాస్త ఇబ్బందిపెట్టింది. కామెడీ చేస్తున్నాడనుకుని చేసిన చేష్టలు, కొన్ని డైలాగ్స్ మినహా వర్కవుట్ అవ్వలేదు.

ఇక మిత్రా శర్మ అమాయకంగా చాలా బాగా నటించింది. స్వచ్ఛమైన ప్రేమ కోసం తహతహలాడే అమ్మాయిగా ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం పనితీరు: స్మరణ్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. పాటలు చాలా బాగున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంటే అతనికి మంచి పేరొచ్చేది. అయితే.. సంగీత దర్శకుడిగా అతడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు. పాటలన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వలేకపోయాయి. కలరింగ్ విషయంలో ఇంకా కేర్ అవసరం. ప్రోడక్ట్ మీద లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని టీమ్ గుర్తించకపోవడం గమనార్హం.

దర్శకుడు దయానంద్ పనితనం పర్వాలేదనిపించేలా ఉంది. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో వాళ్లని ఎగ్జైట్ చేసే అంశాలు పుష్కలంగా జొప్పించాడు. అయితే.. ఎక్కడా కూడా అతడి ఒరిజినల్ మార్క్ కనిపించలేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కండోమ్ యాడ్స్, కొన్ని బెంగాలీ సినిమాల సన్నివేశాల నుండి భారీ స్ఫూర్తి పొందాడు. అలా కాకుండా సొంత క్రియేటివిటీ చూపించి ఉంటే దర్శకుడిగా తనకంటూ సొంత మార్క్ క్రియేట్ అయ్యేది.

విశ్లేషణ: అడల్ట్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ మంచి రిసెప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కౌంట్ కాస్త ఎక్కువే. “ఈరోజుల్లో, బస్టాప్” లాంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. “వర్జిన్ బాయ్స్” కూడా అదే తరహా ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. అయితే.. ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ ఇంకాస్త ఓపెన్ గా ఉండడంతో ఇంకొన్ని బోల్డ్ సీన్స్ యాడ్ చేశారు. అయితే.. ఒరిజినాలిటీ మిస్ అవ్వడంతో.. కామెడీ & గ్లామర్ కాస్త ఆకట్టుకున్నా, పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే.. టార్గెట్ ఆడియన్స్ ను మాత్రం ఓ మోస్తరుగా మెప్పించగలిగింది అనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: టార్గెట్ ఆడియన్స్ కి మాత్రమే!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus