Virupaksha: మొత్తానికి ‘విరూపాక్ష’ తో 1 మిలియన్ కొట్టిన సాయి ధరమ్ తేజ్

  • April 27, 2023 / 07:42 PM IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’.. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఓ విధంగా సాయి ధరమ్ తేజ్ కు ఇది రీ ఎంట్రీ మూవీ అని చెప్పాలి. 2021 లో ఎవ్వరూ ఊహించని విధంగా ఇతనికి బైక్ యాక్సిడెంట్ అవ్వడం.. అటు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో ‘విరూపాక్ష’ వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న (Virupaksha) ఈ మూవీ వీక్ డేస్ లో కూడా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ ఊహించని విధంగా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. తాజాగా ఈ మూవీ 1 మిలియన్ డాలర్లను వసూల్ చేసి అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ కు ఇదే మొదటి 1 మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం.

2014 లో వచ్చిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. అటు తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు కానీ అవేవి కూడా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకోలేకపోయాయి.

మిడ్ రేంజ్ హీరోల్లో చాలా మంది హీరోలు తమ సినిమాలతో 1 మిలియన్ మార్క్ ను అందుకున్నారు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం అక్కడ 1 మిలియన్ కొట్టడానికి 8 ఏళ్ళ వరకు టైం పట్టింది. ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ 1 మిలియన్ మూవీస్ ఇస్తాడేమో చూడాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus