విశాల్ మాటలతో చర్చించుకుంటున్న అభిమానులు

హీరో విశాల్ సినీ కెరీర్ లో పందెం కోడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2005 లో వచ్చిన ఈ మూవీ రెండు భాషల్లోనూ సంచలన విజయం సాధించింది.  ఆ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుకున్నమూవీ పందెం కోడి 2. ఈ మూవీ ట్రైలర్  రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ మూవీని జయంతి లాల్, అక్షయ్ లతో కలిసి విశాల్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ మూవీ అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది.  ఈ సందర్భంగా విశాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “”అప్పట్లో ‘పందెం కోడి’ సినిమా నేను చేసి ఉండకపోతే ఎన్టీఆర్ గానీ .. చరణ్ గాని చేసేవారు. ఎందుకంటే వాళ్లు ఈ కథ కోసం ఎంతగానో ప్రయత్నించారు.

ఈ సినిమాను నాతోనే చేయాలనే మా నాన్న పట్టుదల వల్లనే తొలి సక్సెస్ నాకు దక్కింది. ఆయన ఆశీస్సుల వల్లనే మళ్లీ ఇంత కాలానికి సీక్వెల్ లోను నేనే చేస్తున్నాను. ఈ సినిమా అన్నివర్గాల వారికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు. అతని మాటలను మెగా, నందమూరి అభిమానులు చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఆది, సింహాద్రి వంటి హిట్స్ అందుకున్న సమయంలో ఎన్టీఆర్  పందెం కోడి సినిమా చేసి ఉంటే కలక్షన్ల వర్షం కురిసేదని చెప్పుకుంటున్నారు. చరణ్ అప్పట్లో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. కథలను పరిశీలిస్తున్నారు. ఈ కథతో ఎంట్రీ ఇచ్చి ఉంటే తొలిసినిమాతోనే మాస్ ఫాలోయింగ్ సంపాదించుకునేవారని మెగా అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus