కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ హీరోగా సిహెచ్ వినోద్ దర్శకత్వంలో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ముందుకు రాబోతున్న చిత్రం లాఠీ. ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాల్ కొందరు కాలేజీ విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.
ఈ క్రమంలోని కాలేజీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు విశాల్ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ఈయనని ప్రశ్నిస్తూ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ లో మీకు ఎవరంటే ఇష్టము అని ప్రశ్నించగా వెంటనే విశాల్ సమాధానం చెబుతూ… తనకు సీఎం జగన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు.ఇకపోతే కుప్పం నుంచి టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే ప్రశ్న కూడా ఎదురయింది.
ఈ ప్రశ్నకు విశాల్ సమాధానం చెబుతూ కుప్పంలో తనకు కొన్ని బిజినెస్ లు ఉన్నాయని తెలిపారు. అయితే తాను ఏ ఎన్నికలలోను పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా విశాల్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రజలకు సేవ చేయాలి అంటే కేవలం రాజకీయాలలోకి రావాలని లేదు సేవ చేయాలంటే రాజకీయాలలోకి రాకుండా అయినా కూడా సేవ చేయొచ్చుని తెలిపారు.
ప్రస్తుతం తాను సినిమా రంగంలో చాలా సంతోషంగా ఉన్నానని ఇదే రంగంలోనే తాను కొనసాగుతానని,రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలు ఏమాత్రం లేవంటూ ఈ సందర్భంగా విశాల్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.