11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(ఇప్పుడు సాయి దుర్గ తేజ్).. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'(Subramanyam for Sale) సినిమాని తెరకెక్కించాడు. ‘శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Subramanyam for Sale

‘గబ్బర్ సింగ్’ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే 2015 సెప్టెంబర్ 24న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కథ పాతగానే ఉన్నప్పటికీ హరీష్ శంకర్ టేకింగ్ ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఈ సెప్టెంబర్ 24కి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  5.8 cr
సీడెడ్  2.7 cr
ఉత్తరాంధ్ర  1.9 cr
ఈస్ట్  1.5 cr
వెస్ట్  1.02 cr
గుంటూరు  1.01 cr
కృష్ణా  1.42 cr
నెల్లూరు  0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  16.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.38 Cr
  ఓవర్సీస్   0.42 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  17.87 cr

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.17.87 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా ఈ సినిమా రూ.1.87 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus