Vishnu Priya: అందుకే ఇండస్ట్రీకి వచ్చాను కానీ.. విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్!

యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya)  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అనేక షోలలో సందడి చేస్తూ అందరినీ నవ్విస్తూ.. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో యువతని కవ్విస్తూ.. హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ బ్యూటీ. తర్వాత ‘బిగ్ బాస్’ ద్వారా కూడా సందడి చేసింది. ఇప్పుడు పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. విష్ణుప్రియ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “నా ఫస్ట్ లవ్ కి అంటే ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడి…

Vishnu Priya

డబ్బుల కోసం ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాని తర్వాత మరిన్ని ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలో ఫన్ బకెట్ లో కూడా చేయడం జరిగింది. దాని ద్వారా అందరినీ నవ్వించే అవకాశం నాకు లభించింది. అందరినీ నవ్వించడం అనేది నాకు ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే అందులో చేశాను. దాని తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నన్ను అప్రోచ్ అయ్యాయి. అటు తర్వాత ‘పోవే పోరా’ ఆడిషన్ కి వెళ్లడం జరిగింది.

అందులో యాంకర్ ఛాన్స్ వచ్చింది. అక్కడి నుండి నా జర్నీ అందరికీ తెలిసిందే” అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ ‘ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్’ అని విష్ణుప్రియ పలకడాన్ని బట్టి.. ‘తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఆమెకు మరో బాయ్ ఫ్రెండ్ కూడా ఉండి ఉండవచ్చు’ అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే విష్ణుప్రియ అలా చెప్పడంలో ఉన్న బోల్డ్ నెస్ ను కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus