Vishnu Priya: రాఘవేంద్రరావు గారి చొరవతో ఆ కల నిజమైంది: విష్ణు ప్రియ

పోవే పోరా అనే బుల్లితెర కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె బుల్లితెరపై రావడం కన్నా ముందుగా మోడల్ గా తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మారిన విష్ణు ప్రియ అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపై కానీ లేదా వెండితెరపై గాని ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అవకాశాల కోసం తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు.ఈ విధంగా విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమె వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమాలో సుదీర్ దీపికా పిల్లి జంటగా నటించగా అనసూయ, విష్ణుప్రియ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించగా..ఈ మీడియా సమావేశంలో భాగంగా విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ తాను సినిమాలో నటించకుండా హీరోయిన్ కాకుండానే చనిపోతానేమోనని భయం వేసింది. కానీ రాఘవేంద్రరావు చొరవ వల్ల నా కల నెరవేరింది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రచ్చ చేసిన విష్ణు ప్రియ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus