భార్య ఫై కామెంట్స్ చేసిన విష్ణు

మంచు ఫ్యామిలీలో వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ స్టార్  విష్ణు తనదైన శైలిలో ఎంటర్‌టేన్‌మెంట్ చిత్రాల్లో దూసుకు పోతున్నాడు. అయితే దాదాపుగా 7ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో ఈ రోజు తన యానివర్సేరిని జరుపుకుంటున్నాడు. ‘కొబ్బరి మట్ట’ సినిమాతో తనలోని రచయిత యాంగిల్ ను ఓపెన్ చేసిన విష్ణు, తన భార్యపై తనకున్న ప్రేమను, తమ మధ్య జరిగిన సంఘటనలని ఒక డిఫరెంట్ మెసేజ్ లో భార్యకు పంపించాడు…ఇక ఆ మెసేజ్ లో ఏముందంటే….భార్యగా తాను ఎలా ఉంటుందో….భర్తగా విష్ణు ఎలా ఉంటాడో, క్లుప్తంగా వివరించాడు. ‘అందమైన అమ్మాయిలను నువ్వు ఫ్లర్ట్ చేస్తూ ఉంటావ్. నీ లాంటి మొగుడు కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే నీకు  కట్ చేసేదాన్ని’  అని హన్సిక ఒకసారి విష్ణుతో చెప్పిందట’ ఈ విషయాలను గుర్తుకు చేసుకుంటూ విష్ణు తాను చాలామందితో రొమాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా అందమైన భామలతో కలిసి తిరుగుతాను.

ఇది నా ప్రొఫెషన్ అని కామెంట్ చేస్తూ అయితే భర్తగా తనెలా ఉంటాడో కూడా పోస్ట్ చేసాడు.  ‘నేను ఏడాదిలో 300 రోజులు భార్య సహనానికి టెస్ట్ పెడుతూ ఉంటాను. యానివర్సరీలు, బర్త్ డే ఈవెంట్లు, కలిసి డిన్నర్ చేయడం అన్నీ మిస్ అవుతూ ఉంటాను. తొందరగా నిద్రపోయి, ఆమె లేచేలోపలే షూటింగ్ కి వెళ్లిపోతాను. ఇప్పటివరకూ తనని హనీమూన్ కి కూడా తీసుకెళ్లలేదు. అయినా నా భార్య ఎటువంటి కండిషన్లు లేకుండా నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. పొద్దున్నే ఆమె మొహాన్ని చూసినపుడు దేవుడు నాకిచ్చిన వరం అని అనిపిస్తుంది. ‘హ్యాపీ యానివర్సరీ వినీ’ అంటూ తన మెసేజ్ ని ముగించాడు. ఏది ఏమైనా….విష్ణు కొంటె కుర్రాడు అంటే నమ్మాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus