శ్రీవిష్ణు హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). ఫిబ్రవరి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. యుదాంత్ మారుతీరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘అల్లుడు అదుర్స్’ ‘హరోం హర’ వంటి సినిమాలు నిర్మించిన సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని తన ‘శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్’ సంస్థపై నిర్మించారు. హేమ అండ్ శాలిని సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగిందని ట్రేడ్ పండితుల సమాచారం.
నిర్మాత కూడా తన గత సినిమాల ఫలితాన్ని ఈ సినిమా మరిపిస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అదే కాన్ఫిడెన్స్ తో ఆయన ఇండస్ట్రీకి చెందిన కొంతమంది స్నేహితులకి, సన్నిహితులకి, నిర్మాతలకి ఈ సినిమాని చూపించారట. సినిమా చూశాక వారు చెప్పిన టాక్ ప్రకారం.. ‘విష్ణు విన్యాసం’ ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా సాగుతుందట.
జాతకాలను గుడ్డిగా నమ్మే హీరో ఊహించని విధంగా హీరోయిన్ ప్రేమలో పడటం, ఆ హీరోయిన్ వేరే ఉద్దేశంతో హీరోని ప్రేమలో పడేయటం అనేది ట్విస్ట్ అని అంటున్నారు. సెకండాఫ్ లో కూడా ఫన్ బాగా వచ్చిందట. క్లైమాక్స్ లో చిన్న మెసేజ్ కూడా ఇచ్చారట.
రాజేంద్రప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాని తాలిపించేలా ‘విష్ణు విన్యాసం’ ఉంటుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. శ్రీవిష్ణు మార్క్ కామిడీ, స్టోరీ లైన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని ఆకట్టుకుంటాయని అంటున్నారు. రథన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.