‘మోస‌గాళ్లు’లో విష్ణు మంచు స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తున్న రుహీ సింగ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి రేకెత్తిస్తోన్న ‘మోస‌గాళ్లు’ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న నాయిక‌గా రుహీ సింగ్ న‌టిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది. ఆ పోస్ట‌ర్‌లో రాత్రివేళ రోడ్డుపై ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళ్తున్నారు రుహీ సింగ్‌. డిజైన‌ర్ దుస్తుల్లో ఆమె గార్జియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్‌శెట్టి, రుహీ సింగ్‌ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. వాటితో పాటు ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు సినీ ప్రియుల నుంచి అద్వితీయ‌మైన స్పంద‌న ల‌భించింది. టీజ‌ర్‌లో శ్యామ్ సి.ఎస్‌. బ్యాగ్రౌండ్ స్కోర్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి.

‘మోస‌గాళ్లు’ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతోంది. విష్ణు హీరోగా న‌టిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆయ‌న సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌టం విశేషం. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ సునీల్‌శెట్టి టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus