Vishwak Sen: విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. మంచి నిర్ణయమే అంటూ..!

విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్నాడు. ‘గామి’ (Gaami) తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’Gangs of Godavari)  ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)   ‘లైలా’ (Laila) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు పరాజయం పాలయ్యాయి. విశ్వక్ సేన్ కి ఒక అలవాటు ఉంది. వరుసగా సినిమాలు ఒప్పేసుకుని బిజీగా ఉండటం అనేది అతనికి అలవాటు. దాన్ని ఇప్పుడు మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఫంకీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Vishwak Sen

‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu)  ఫేమ్ అనుదీప్ కేవీ (Anudeep Kv)   దీనికి దర్శకుడు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ ఇప్పుడు ‘ఫంకీ’ తప్ప మరో సినిమా చేయడం లేదు. అతని ఫుల్ ఫోకస్ ఈ సినిమాపైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడట. ఇది పూర్తయ్యాకే మరో సినిమా చేస్తానని విశ్వక్ సేన్ తన వద్దకు వచ్చే దర్సకనిర్మాతలతో చెబుతున్నట్టు టాక్ నడుస్తుంది.

ఇక ‘ఫంకీ’ తర్వాత విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ తో (Tharun Bhascker) ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ఇదే క్రమంలో వేరే నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్సులు కూడా వడ్డీలతో సహా వెనక్కి వేసేశాడట. ఇక నుండి డెడికేటెడ్ గా ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే మరో సినిమా చేయాలని.. లుక్ విషయంలో కూడా శ్రద్ధ పెట్టడానికి అప్పుడు వీలుగా ఉంటుందని విశ్వక్ తెలిపినట్టు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus