మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah).. పరిచయం అవసరం లేని పేరు. దాదాపు 17 ఏళ్ళ పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో తమన్నా డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని కీలక పాత్రలతో, స్పెషల్ సాంగ్స్ తో ఆమె కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. స్పెషల్ సాంగ్స్ కి కూడా తమన్నా రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ వచ్చింది. అయితే ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) వంటి భామలు కూడా తమన్నా రెమ్యూనరేషన్ కే స్పెషల్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టడంతో..
టాలీవుడ్ దర్శక నిర్మాతలు అంతా తమన్నాని లైట్ తీసుకున్నారు. ఇక తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) తమన్నా ప్రేమలో పడింది. ఆ తర్వాత తమన్నా.. విజయ్ తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది.ఈ జంట ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .తర్వాత ఈ జంట కలిసి ముంబైలో ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. దాదాపు 2 ఏళ్ళ నుండి వీళ్ళు అక్కడే కలిసి ఉంటున్నారు.
మొన్నామధ్య వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. వెడ్డింగ్ ప్లేస్ కోసం కూడా వీళ్ళు అన్వేషించడం జరిగింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో.. వీళ్ళు విడిపోవడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది. ఇద్దరూ ఆల్రెడీ సెపరేట్ అయిపోయారట. ఇక నుండి ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతామని వీళ్ళు ఓ ఆంగ్ల మీడియాకి వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కలిసి నటించింది తమన్నా. ఆ సిరీస్లో వీళ్ళ మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.