ముదిరిన ప్రాంక్ వీడియో వివాదం.. లైవ్ లోనే బూతులతో రెచ్చిపోయిన విశ్వక్ సేన్..!

  • May 2, 2022 / 02:55 PM IST

విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’.. ఈ శుక్రవారం అంటే మే 6న విడుదల కాబోతుంది. తన ప్రతీ సినిమాకి ప్రమోషన్ల విషయంలో వింత వింత స్ట్రాటజీలు వాడుతుంటాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కూడా ఓ ప్రాంక్ వీడియో ప్లాన్ చేసాడు.ఇందులో భాగంగా… విశ్వక్ సేన్ తన కారులో వెళ్తుంటే.. అతని కారుకి అడ్డుగా ఓ కుర్రాడు వచ్చి అర్జున్ కుమార్ అల్లం( సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర పేరు) ఎక్కడ అంటూ విశ్వక్ సేన్ మరియు అతని సన్నిహితుల వద్ద గట్టిగా అరుస్తూ… ‘అతనికి పెళ్లి కాకపోవడం ఏంటి.. నేను పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా’ అంటూ బెదిరిస్తాడు.

దీంతో విశ్వక్ సేన్ అండ్ టీం అతన్ని కూల్ చేస్తున్నట్టు నటించి కార్ లో ఎక్కించి పంపించేస్తారు. ఆ పెట్రోల్ పోసుకున్నట్టు హడావిడి చేసిన కుర్రాడు ప్రతీ సినిమాకి పబ్లిక్ టాక్ చెబుతూ ఉంటాడు. ఆ కుర్రాడు సినిమా కూడా చూడకుండా రివ్యూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ చూసినా సినిమా పూర్తయ్యే అరగంట ముందుకు బయటకి వచ్చేసి పబ్లిక్ టాక్ చెబుతూ ఉంటాడు. మైక్ లో పిచ్చి వాగుడు వాగే వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీలు కాబట్టి.. అతను పాపులర్ అయ్యాడు. సో అతన్ని పిలిపించి ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ప్రమోషన్లు జరిపించారు. ‘అది కేవలం ప్రాంక్ వీడియో’ అని విశ్వక్ సేన్ మరియు ఆ కుర్రాడు చెప్పినప్పటికీ.. పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసారంటూ.. లాయ‌ర్ అరుణ్ కుమార్ మానవ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఇష్యు పై ఓ ఛానెల్ వారు డిబేట్ నిర్వహించారు. దీనిని హోస్ట్ చేసింది యాంకర్ కమ్ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ నాగవల్లి.విశ్వక్ సేన్ ఈ డిబేట్ లో పాల్గొన్నాడు. ‘మేము చేసింది ప్రాంక్ వీడియో మాత్రమే.. క్యాన్‌లో నీళ్లు తీసుకుని చేసిన ప్రాంక్ వీడియోను కొంతమంది పెట్రోలు అని చూపించారే త‌ప్ప‌, మేం పెట్రోలు వాడ‌లేదు. హ్యుమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లిన అరుణ్ కుమార్‌కి పెట్రోలు, నీళ్లకు తేడా తెలియ‌డం లేదా.. నీళ్లు ఎలా అంటుకుంటాయి.’ అంటూ విశ్వక్ సేన్ ప్రశ్నించాడు. అదే లైవ్ లోకి లాయర్ అరుణ్ కుమార్ కూడా వచ్చి‘కోట్ల రూపాయలు కుమ్మరించి సినిమాలు తీసి, మీ స్వార్థం కొరకు ప్రాంక్ వీడియోలు చేయడం కరెక్టేనా!. నేను వ్యక్తుల మీద ఫిర్యాదు చేయలేదు’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

ఈ క్రమంలో యాంకర్ నాగవల్లి.. విశ్వక్ సేన్ ను డిప్రెస్డ్ పర్సన్ అంటూ కామెంట్ చేసింది. దీంతో విశ్వక్ సేన్ రెచ్చిపోయాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లి పోయాన‌ని మీరు స్టేట్‌మెంట్ పాస్ చేయ‌డం క‌రెక్ట్ కాదు. అలా ఏ డాక్ట‌ర్ చెప్పాడో అతని నెంబ‌ర్ నాకు ఇవ్వండి. నేను మాట్లాడతాను. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మీకు ఏం తెలుసు. దాని గురించి మాట్లాడే హ‌క్కు మీకు లేదు.నాకు మీరు ‘పాగ‌ల్ సేన్’ అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై ప‌రువు న‌ష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయ‌ను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి డిప్రెష‌న్ ప‌ర్స‌న్ అని, పాగ‌ల్ శీను అని అన‌డం స‌రికాదు’ అని అన్నాడు.

వెంటనే యాంకర్ ‘గెటవుట్ ఆఫ్ మై స్టూడియో’ అంటూ అరిచింది. ‘‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’ అంటూ విశ్వ‌క్ అరవగా .. ‘యు జస్ట్ షటప్’ అని విశ్వక్ సేన్ స్టూడియో నుంచి బయటకు వెళ్లే వరకు అరుస్తూనే ఉంది. ఇది కూడా ప్రాంక్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే గతంలో ఇలాంటివి చాలా చూశాం అంటూ మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus