Vishwak Sen: స్టైలిష్ లుక్కుతో కత్తి పట్టిన విశ్వక్ సేన్

  • July 6, 2021 / 11:05 AM IST

మాస్ హీరోగా క్లిక్కవ్వాలని విశ్వక్ సేన్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. మనోడి దగ్గర టాలెంట్ బాగానే ఉంది గాని ఇంకా సరైన సినిమా తగల్లేదు. ఒక్క హిట్టు పడితే మళ్ళీ తగ్గకుండా కెరీర్ ను సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా తరుణ్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలక్ నుమా దాస్ సినిమాలో మాస్ కా దాస్ అంటూ ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక ఇటీవల స్టైలిష్ లుక్ లో కూడా మాస్ టచ్ ఇచ్చాడు. బ్లాక్ కోటు వేసుకొని అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. దానికి తోడు కత్తి పట్టుకొని మాస్ యాంగిల్ ను కూడా ప్రజెంట్ చేశాడు. ఇక ప్రస్తుతం పాగల్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విశ్వక్ టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు.

సాంగ్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది అలాగే ఫలక్ నుమా దాస్ సీక్వెల్ పై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఎలాగైనా నెక్స్ట్ పాగల్ తో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని విశ్వక్ ప్రణాళికలు రచిస్తున్నాడు.

1

2

3

4

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus