మసూద డైరెక్టర్.. ఈసారి హారర్ కాదట!

టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండే హీరోలలో విశ్వక్ సేన్ ముందుంటాడు. అయితే, ఇటీవల చేసిన లైలా సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, తన కెరీర్‌లో మరోసారి పక్కా హిట్ లైన్అప్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం జాతి రత్నాలు (Jathi Ratnalu)  ఫేమ్ అనుదీప్ (Anudeep Kv) దర్శకత్వంలో ఫంకీ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేస్తున్న విశ్వక్ (Vishwak Sen) , తన తదుపరి సినిమాల కోసం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

Vishwak Sen 

తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) మసూద (Masooda) డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నట్లు సమాచారం. గతంలో మసూద సినిమాతో భయాన్ని పుట్టించిన సాయి కిరణ్, ఈసారి హారర్ కాకుండా ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేశాడట. ఈ కథను విన్న విశ్వక్ సేన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నా, ఫంకీ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇది మాత్రమే కాదు, విశ్వక్ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు అయిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తరుణ్ భాస్కర్  (Tharun Bhascker) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా మరో కొత్త కథ రాసేందుకు టీమ్ సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటివరకు విశ్వక్ ఎంచుకున్న కథలు వేరేవారికి సులభంగా అనిపించకపోవచ్చు.

లైలా (Laila) కోసం రిస్క్ తీసుకున్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన రాలేదు. అందుకే ఇప్పుడు మరింత కమర్షియల్ మాస్-ఆడియన్స్ బేస్ ఉన్న కథలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. మసూద లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో పనిచేయడం, మరోవైపు తన బిగ్గెస్ట్ హిట్‌కు సీక్వెల్ చేయడం అన్నీ చూస్తే విశ్వక్ సరైన దిశలో వెళ్తున్నాడనే అనిపిస్తోంది. మరి రానున్న సినిమాలు అతని కెరీర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

రెండేళ్ళలో 1600 కోట్లు కొట్టారు.. చావా నిర్మాతల స్టన్నింగ్ బిజినెస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus