సినిమా కథ ఎలా ఎలా ఉన్నా… హీరో పాత్ర, లుక్ మాత్రం బెస్ట్ ఉండాలి బిగిలూ అంటుంటారు మన ప్రేక్షకులు. అభిమానులు అయితే మరీ ఈ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటారు. అలాంటి ఈ రోజుల్లో ఓ హీరోగా డీగ్లామర్ రోల్ చేయడమే కష్టం. అలాంటిది ఏకంగా అఘోరా పాత్రకు సిద్ధమయ్యారు అంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఇప్పుడు అలాంటి ధైర్యం చేసి అఘోరా పాత్ర చేశాడు మరో కుర్ర హీరో. కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న విశ్వక్‌సేనే ఆ పని చేసింది.
‘గామి’ అనే పేరుతో విశ్వక్‌సేన్ ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత సినిమా గురించి పెద్దగా అప్‌డేట్స్ లేవు. అయితే ఇప్పుడు పోస్టర్‌తో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు మాస్ కా దాస్. ఆ పోస్టర్‌లో విశ్వక్ ‘అఘోరా’గా కనిపించాడు. దీంతో షాక్ తినడం ప్రేక్షకులు, అభిమానుల వంతు అయింది. టాలీవుడ్‌లో రీసెంట్‌గా అఘోరా పాత్ర వేసింది అంటే నందమూరి బాలకృష్ణే. ఆ తర్వాత ఇప్పుడు విశ్వక్ అనే చెప్పాలి. మరి ఎంతలా ప్రభావం చూపిస్తాడో చూడాలి.
అఘోరా పాత్ర తెరమీద అఘోరా చేయడం చాలా రిస్కు అంటుంటారు. కమర్షియల్‌గా మాస్ నుండి మద్దతు ఉండదు అని చెబుతుంటారు. గతంలో ఈ ప్రయోగం చేసి కొంతమంది హీరోలు చేతులు కాల్చుకున్నారు కూడా. 30 ఏళ్ల క్రితమే ‘కాష్మోరా’ అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఈ పాత్ర వేశాడు. అద్భుత నటనను ప్రదర్శించినా జనం మాత్రం సినిమాను అంతగా ఆదరించలేదు. ‘శ్రీమంజునాథ’ సినిమాలో చిరంజీవి ఓ సీన్ కోసం ఈ గెటప్ వేశారు. అక్కడా సేమ్ రిజల్ట్.
‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య పర్ఫార్మన్స్ చూసే ఉంటారు. బెస్ట్ ఇన్ యాక్టింగ్ అని పేరు తెచ్చుకున్నా… బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయి విజయం రాలేదు. అయితే ‘అఖండ’ సినిమాతో మాత్రం బాలయ్య ఈ డిజాస్టర్ స్ట్రీక్‌ను బ్రేక్ చేశాడు. ఆ పాత్రతోనూ బాక్సాఫీసు దగ్గర బాస్ అనిపించుకోవచ్చు అని నిరూపించాడు. ఇప్పుడు విశ్వక్‌సేన్ (Vishwak Sen) మరి ఏ లిస్ట్‌లోకి వెళ్తాడో చూడాలి. రెండోది ఆయనకు సరైన విజయం దక్కి చాలా రోజులైంది. సో ఆయన కెరీర్ పరంగా చూసినా విజయం చాలా అవసరం.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!