Gaami Movie: అడ్వాన్స్ బుకింగ్స్ లో గామి దూకుడు.. బ్లాక్ బస్టర్ ఖాయమంటూ?

(Vishwak Sen) విశ్వక్ సేన్, (Chandini Chowdary) చాందిని చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కిన గామి (Gaami) మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా ఈ సినిమా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ విషయంలో గామి మూవీ జోరు చూపిస్తోంది.

గామి ట్రైలర్ కు యూట్యూబ్ లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. గామి సినిమాకు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది. విశ్వక్ సేన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోమారు మ్యాజిక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టైర్2, టైర్3 సిటీలలో కూడా గామి సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. గామి సినిమా విజువల్స్ వేరే లెవెల్ లో ఉండనున్నాయని ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

విశ్వక్ సేన్ భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించి తన రేంజ్ ను మరింత పెంచుకోవడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ తన సినిమాల కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకే బుకింగ్స్ బాగున్నాయి. శివరాత్రి రోజున రిలీజ్ కావడం ఈ సినిమాకు మరింత కలిసొస్తుందని చెప్పవచ్చు.

గామి సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా భారీ రేంజ్ లో జరిగే అవకాశం అయితే ఉంది. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus