విశ్వక్ సేన్ (Vishwak Sen) టాలీవుడ్‌లో తనదైన మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యువ హీరో. ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emindhi) , ‘ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das) లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించిన అతను, ఇటీవల ‘లైలా’ (Laila) సినిమాతో లేడీ గెటప్‌లో రిస్క్ తీసుకున్నప్పటికీ, ఆ సినిమా విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద బిగ్ మాస్ హిట్స్ అందుకునే సత్తా ఉన్నప్పటికీ, వరుసగా సక్సెస్‌లు అందుకోలేకపోతున్న విశ్వక్, ఇప్పుడు తన మాస్ స్టామినాను చూపించడానికి కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తున్నాడు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ జాతిరత్నాలు (Jathi Ratnalu) దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep Kv) దర్శకత్వంలో ‘ఫంకీ’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాతో పాటు, విశ్వక్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాడు. ‘కల్ట్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను అతను స్వయంగా డైరెక్ట్ చేస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. విశ్వక్ సేన్ గతంలో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో దర్శకుడిగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించాడు.
ఆ సినిమా అతని డైరెక్టోరియల్ టాలెంట్‌ను చాటి, మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘కల్ట్’ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విశ్వక్ స్వయంగా చేస్తున్నప్పటికీ, డైలాగ్స్ కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను (Tharun Bhascker) ఎంచుకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా సమయంలోనే విశ్వక్, తరుణ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది, తరుణ్ రైటింగ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.
‘కల్ట్’ సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది, 2026లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇటీవలి సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో, విశ్వక్ ఈసారి పక్కా ప్లానింగ్‌తో ‘కల్ట్’ సినిమాను తీసుకొస్తున్నాడు. తన నటనతో పాటు, దర్శకత్వంలోనూ సత్తా చాటి, మాస్ హీరోగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాడు. మరి అతని ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.