మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నరేష్ (Naresh) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. అక్టోబర్ 11న విడుదల కాబోతుంది ఈ చిత్రం. గోపీచంద్ గత చిత్రం ‘భీమా’ (Bhimaa) మాస్ సెంటర్స్ లో బాగానే ఆడింది.
Viswam
అందువల్ల బయ్యర్స్ కి ‘విశ్వం’ పై కొంత నమ్మకం కలిగింది. దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ‘విశ్వం’ థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ పెద్దది కాదు కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. లేదు అంటే పోటీలో చాలా కష్టం అయిపోతుంది.