Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Reviews » Maa Nanna Superhero Review in Telugu: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Nanna Superhero Review in Telugu: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 10, 2024 / 05:39 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Maa Nanna Superhero Review in Telugu: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • ఆర్ణా (Heroine)
  • సాయిచంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, ఝాన్సీ తదితరులు.. (Cast)
  • అభిలాష్ కంకర (Director)
  • వి సెల్యులాయిడ్స్ - సునీల్ బలుసు (Producer)
  • జయ్ క్రిష్ (Music)
  • సమీర్ కల్యాణి (Cinematography)
  • Release Date : అక్టోబర్ 11, 2024
  • విఆర్ గ్లోబల్ మీడియా - క్యామ్ ఎంటర్టైన్మెంట్ (Banner)

సుధీర్ బాబు (Sudheer Babu)  హీరోగా తన ఉనికిని చాటుకొనే తాజా ప్రయత్నం “మా నాన్న సూపర్ హీరో” (Maa Nanna Superhero) . కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి సెన్సిబుల్ & ఫాదర్ సెంటిమెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. “లూజర్” వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 11న విడుదలవుతుండగా.. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్ షోస్ వేశారు చిత్రబృందం. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు మంచి హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పుడే తండ్రి అనాథాశ్రమంలో వదిలేయడంతో, అనాథగా పెరిగిన జానీ (సుధీర్ బాబు)ని చిన్నతనంలోనే బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ (షాయాజీ షిండే)  (Sayaji Shinde) దత్తత తీసుకుంటాడు. అయితే.. జానీని దత్తత తీసుకున్న తర్వాత అంతా చెడే జరిగిందని నమ్మి, జానీని చాలా హీనంగా చూస్తుంటాడు శ్రీనివాస్. కానీ.. తండ్రి మీద విపరీతమైన ప్రేమ, గౌరవంతో ఎన్ని మాటలు అన్నా తండ్రి ఎప్పడు ప్రేమగా పిలుస్తాడా అని ఎదురుచూస్తుంటాడు జానీ.

అయితే.. తండ్రి చేసిన తప్పుకు 20 రోజుల్లో కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు జాని ఏం చేశాడు? అసలు జానీ అసలు తండ్రి అతడిని ఎందుకు వదిలేసి వెళ్లాడు? అనేది “మా నాన్న సూపర్ హీరో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సుధీర్ బాబు ప్రతి సినిమాకి పరిణితి చూపుతున్నాడు. అతడి 18 సినిమాల ప్రయాణంలో నటుడిగా చెప్పుకోదగ్గ సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఎక్కడా అతి లేకుండా చాలా సింపుల్ నటనతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా సుధీర్ బాబు సినిమా మొత్తంలో ఎక్కడా షర్ట్ విప్పలేదు. “ఫిదా, సైరా” ఫేమ్ సాయిచంద్ (Sai Chand) మాత్రం పాత్రలో జీవించేశాడు. కొడుకు కోసం వెతికే తండ్రిగా ఆయన కళ్ళల్లో పలికిన హావభావాలు చాలా సహజంగా ఉన్నాయి. అలాగే.. ప్రీక్లైమాక్స్ సీన్ లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది.

షాయాజీ షిండే ఈ క్యారెక్టర్ కి న్యాయం చేసినా, ఆ పాత్రలో రావు రమేష్ (Rao Ramesh) లాంటి నటుడైతే ఇంకాస్త కనెక్ట్ అయ్యేవారు ప్రేక్షకులు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం (Raju Sundaram) కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ అర్ణా ఒక పాట, రెండు సీన్లకు పరిమితం అయిపోయింది. “రాజన్న” ఫేమ్ అని (Baby Annie) ఈ చిత్రంలో మంచి సహాయ పాత్రలో కనిపించింది. హర్షవర్ధన్ (Harsha Vardhan) , విష్ణు ఓయ్, జాన్సీ (Jhansi) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అభిలాష్ కంకర ఒక సింపుల్ స్టోరీని, ఎమోషనల్ గా ప్రెజంట్ చేయాలనుకున్నాడు. అందుకు తండ్రీకొడుకుల మధ్య ఉండే కామన్ ఎమోషన్ ను మూలకథగా ఎంచుకున్నాడు. సుధీర్ బాబు & షాయాజీ షిండే నడుమ కెమిస్ట్రీని ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఎలాంటి అసభ్యతకు, మతిలేని పోరాట సన్నివేశాలకు తావు లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించడంలో అభిలాష్ విజయం సాధించాడు. మరీ ముఖ్యంగా నేటి సమాజంలో మనుషులు మర్చిపోతున్న మానవతా బంధాలను, మానవీయ విలువలను చక్కగా చూపించిన విధానం బాగుంది.

అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. మరీ సింగిల్ లైన్ స్టోరీ కావడంతో 127 నిమిషాల సినిమా కూడా చాలా చోట్ల బాగా సాగింది. జయ్ క్రిష్ పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించుకోగా, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగున్నాయి.

విశ్లేషణ: “మా నాన్న సూపర్ హీరో” కచ్చితంగా మనసుల్ని హత్తుకునే కథా బలమున్న చిత్రం. సుధీర్ బాబు నీట్ పెర్ఫార్మెన్స్, అభిలాష్ కంకర టేకింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. అయితే.. కథనంలో కాస్తంత వేగం, కథలో కాస్తంత కనెక్టివిటీ మిస్ అవ్వడంతో ఆడియన్స్ సినిమాతో ట్రావెల్ చేయలేకపోతారు. సుధీర్ బాబు కెరీర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సినిమాగా నిలుస్తుంది.

ఫోకస్ పాయింట్: మానవతా విలువల ఆవశ్యకతను తెలియజెప్పిన హృద్యమైన చిత్రం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhilash Reddy Kankara
  • #Maa Nanna Superhero
  • #Sudheer Babu

Reviews

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

trending news

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

2 hours ago
Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

3 hours ago
Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

5 hours ago
Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

5 hours ago
Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

8 hours ago

latest news

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

5 hours ago
Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

5 hours ago
Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

5 hours ago
Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

5 hours ago
Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version