Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Vettaiyan Review in Telugu: వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vettaiyan Review in Telugu: వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 10, 2024 / 12:40 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Vettaiyan Review in Telugu: వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రజినీకాంత్ (Hero)
  • మంజు వారియర్ (Heroine)
  • అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, అభిరామి, దుషారా విజయన్, రావు రమేష్ (Cast)
  • టి.జె. జ్ఞానవేల్ (Director)
  • సుభాస్కరన్ అల్లిరాజా (Producer)
  • అనిరుధ్ రవిచందర్ (Music)
  • ఎస్.ఆర్. కతీర్ (Cinematography)
  • Release Date : అక్టోబరు 10, 2024
  • లైకా ప్రొడక్షన్స్ (Banner)

“జై భీమ్” చిత్రంతో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel)  దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “వేట్టయన్” (Vettaiyan) . రజనీకాంత్ (Rajinikanth)  టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana) కీలకపాత్రలు పోషించారు. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ తమిళ టైటిల్ తో విడుదలవ్వడం చిన్నపాటి హడావుడి సృష్టించింది. అయితే.. “వేటగాడు” అనే టైటిల్ దొరక్కపోవడం వల్లే తమిళ టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు చిత్రబృందం. మరి ఈ తమిళ డబ్బింగ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Vettaiyan Review in Telugu

కథ: పోలీస్ డిపార్టుమెంట్లో “హంటర్”గా పిలవబడే అతియన్ (రజనీకాంత్)కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పబ్లిక్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. శరణ్య (దుషారా విజయన్) (Dushara Vijayan) హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసే క్రమంలో.. ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయని గ్రహిస్తాడు అతియన్. అతియన్ మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరి పేర్లు బయటకి వచ్చాయి? అసలు శరణ్యను ఎందుకు చంపాలనుకున్నారు? ఆమె హత్య వెనుక ఉన్నది ఎవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “వేట్టయన్” (Vettaiyan) చిత్రం.

నటీనటుల పనితీరు: రజనీకాంత్ ఈ సినిమాలోని అతియన్ పాత్రలో ఎప్పట్లానే తనదైన స్టైల్ & స్క్రీన్ ప్రెజన్స్ తో అదరగొట్టాడు. అయితే.. యాక్షన్ సీన్స్ లో మాత్రం ఆయన వయోభారం చాలా క్లారిటీగా కనిపిస్తోంది. చిన్నపాటి మూమెంట్స్ విషయంలోనూ ఇబ్బందిపడుతున్నారు. ఇకపై ఆయనపై ఈ తరహా భారీ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసేప్పుడు జాగ్రత్తపడితే బెటర్. నిజానికి ఫహాద్ పోషించాల్సినంత పెద్ద పాత్రమీ కాదు ఈ సినిమాలో ప్యాట్రిక్ క్యారెక్టర్. కేవలం రజనీకాంత్ మీద గౌరవంతో నటించి ఉంటాడు.

అతడి పాత్రతో కథనాన్ని వేగవంతం చేసిన విధానం బాగుంది. ఓ బాధ్యతాయుతమైన పాత్రలో అమితాబ్ కనిపించారు. మానవ హక్కులను కాపాడే అధికారిగా ఆయన నటన సినిమాకి మంచి వేల్యు యాడ్ చేసింది. మంజు వారియర్ (Manju Warrier) , రితికా సింగ్ (Ritika Singh) లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కార్పొరేట్ క్రిమినల్ గా రానా దగ్గుబాటి నటరాజ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా హీరోను బట్టి తమ ఫార్మాట్ ను మార్చుకుని, హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకులు. కానీ.. జ్ఞానవేల్ మాత్రం సూపర్ స్టార్ ఇమేజ్ ను తనదైన బాధ్యతాయుతమైన కథతో ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. సినిమా అనే ఓ అద్భుతమైన మాధ్యమాన్ని వినియోగించుకుని ప్రస్తుతం సమాజంలో ప్రజలు కోపంతో కోరుకునేది న్యాయం కాదని, న్యాయంగా పడేదే శిక్ష అని వివరించిన విధానం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. అలాగే.. రజనీకాంత్ అభిమానులను కూడా ఎక్కడా నిరాశపరచకుండా, కథలో కావాలని ఇరికించకుండా రాసుకున్న యాక్షన్ బ్లాక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా పోలీస్ ప్రొసీజర్స్ & న్యాయ వ్యవస్థ సమాజం పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనే విషయాలను చూపించిన విధానం బాగుంది. అలాగే.. డబ్బున్న కార్పొరేట్ క్రిమినల్స్ చట్టాన్ని, న్యాయాన్ని తమకు వీలుగా ఎలా మార్చుకుంటున్నారు, ప్రజల బలహీనతలను వాడుకొని వాళ్ళ ఎలా దోచుకుంటున్నారు అనేది చూపించిన విధానం రాష్ట్రంలో మొన్నామధ్య జరిగిన “బైజూస్ యాప్” ఉదంతాన్ని గుర్తుచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్స్టంట్ జస్టిస్ అనేది ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు.

ఒక దర్శకుడిగా, కథకుడిగా తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్నాడు జ్ఞానవేల్. అనిరుధ్ (Anirudh Ravichander)  ఎప్పట్లానే తనదైన పనితనంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కథిర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గానే నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే.. కొన్ని పాత్రలతో మాట్లాడించిన తెలంగాణ యాస చాలా అసహజంగా ఉంది.


విశ్లేషణ: పోలీస్ ఎన్ కౌంటర్ లకు చిన్నప్పటి మద్దతు ఇస్తూనే.. ఆ ఎన్ కౌంటర్ల పేరు మీద జరిగే బడా మోసాలను ఎండగట్టిన సినిమా “వేట్టయన్”. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లు ఈ తరహా ప్రాజెక్ట్ లో కనిపించడం వల్ల దర్శకుడు జ్ఞానవేల్ చెప్పాలనుకున్న అంశానికి మంచి వేల్యు ఏర్పడింది. స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు ఈ తరహా సినిమాలు చేయడం అనేది ప్రశంసార్హమైన విషయం. మాస్ ఎలివేషన్స్ తోపాటు సమాజంలోని మంచిని, చెడుని ప్రేక్షకులకు గుర్తుచేయడం బాధ్యతగా భావించడం ముఖ్యం. ఈ పద్ధతిని మరింతమంది సూపర్ స్టార్లు అప్పుడప్పుడు ఫాలో అయితే చాలా బాగుంటుంది.


ఫోకస్ పాయింట్: రజనీ మార్క్ మిస్ అవ్వని బాధ్యతగల సినిమా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Fahadh Faasil
  • #Manju Warrier
  • #Rajinikanth
  • #Rana Daggubati

Reviews

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

16 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

16 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

2 days ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

18 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

1 day ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

2 days ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version