Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వంభర’. ఇంత సాఫ్ట్‌గా ఈ సినిమాకు ఇంట్రో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఆ సినిమాకు ఉన్న హైప్‌ మొత్తం పోయింది. ఆ మధ్య వాయిదా వేస్తూ ఇచ్చిన మరో టీజర్‌తో కాస్త హైప్‌ పెరిగింది. అయితే సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో చెప్పకుండా ఆ హైప్‌ బాగా తగ్గిపోయింది. కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్‌ ఆ సినిమాను మరచిపోయే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

Vishwambhara

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా రిలీజ్‌ సమయంలో చిరంజీవి మాట్లాడుతూ సినిమాను జులైలో రిలీజ్‌ చేస్తామని చెప్పారు. దీంతో జూన్‌లో ఏమన్నా సినిమా మీద అప్‌డేట్ వస్తుందేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ సగం జూన్‌ అయిపోయింది ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఏమైందా అని చూస్తే ఇప్పట్లో సినిమా రిలీజ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కారణం సరైన డేట్‌ లేకపోవడమే అని అంటున్నారు.

జులైలో సినిమాను రిలీజ్‌ చేయడం కష్టం కాబట్టి.. ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మూడో వారంలో సినిమాను రిలీజ్‌ చేస్తారు అనే టాక్‌ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఆ డేట్‌కి కూడా కష్టమే అని అంటున్నారు. లేదంటే దసరా సందర్భంగా అక్టోబరులో సినిమా రిలీజ్‌ చేయొచ్చు. మరి అప్పటికి ఎవరూ తమ సినిమాతో రెడీగా లేకపోతే ఈ సినిమా రావొచ్చు. ఆ టైమ్‌కి కాకపోతే ఇక మిగిలిన ఆప్షన్‌ డిసెంబరు మొదటివారం.

ఆ తర్వాత మళ్లీ చాలా నెలలు డేట్స్‌ లేవు. సంక్రాంతికి చిరంజీవి – బాబీ సినిమాను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఆ లెక్కన సంక్రాంతికి ‘విశ్వంభర’ వెళ్లే ఛాన్సే లేదు. ఈ నేపథ్యంలో లోకాలు తిరిగే వ్యక్తి కథతో రూపొందుతున్న ‘విశ్వంభర’ను విడుదల చేయడానికి ఆ సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌కు దారి చూపించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus