ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరో గ్యాంగ్ స్టర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. బెంగుళూరుకు చెందిన అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ ‘రాయ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో రాయ్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించనున్నాడు. మొదట రాయ్ పాత్రకు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ను సంప్రదించినప్పటికీ.. డేట్స్ ప్రోబ్లం కారణంగా ఆటను ప్రొజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. అందుకే సుదీప్ స్థానంలో వివేక్ ను ఎంపిక చేశాడు రాంగోపాల్ వర్మ. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సిఆర్ మనోహర్ నిర్మించనున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ మంగళూరు, బెంగళూరు, ముంబై, లండన్, దుబాయి లలో జరగనుంది. ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1 న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు కూడా వర్మ తెలిపారు.