మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రమైన ‘ఖైదీ నెంబర్ 150’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడనుకున్న వినాయక్.. ఆ తరువాత ‘ఇంటిలిజెంట్’ అనే ప్లాప్ తో మళ్ళీ ఢీలా పడిపోయాడు. అయినప్పటికీ ఇతని మాస్ ఫాలోయింగ్ కు ఏమాత్రం దెబ్బ పడలేదు. అయితే హీరోలందరూ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తరుణంలో.. వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా నటుడు కావాలని ట్రై చేసాడు. ‘శరభ’ దర్శకుడు ఎన్.నరసింహ రావుతో ‘సీనయ్య’ అనే చిత్రం చెయ్యడానికి వినాయక్ ఓకే చెప్పాడు.
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ కూడా కొన్నాళ్ళపాటు జరిగింది. అయితే తరువాత కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు వచ్చిన తరుణంలో.. దర్శకుడు నరసింహారావు ఆ వార్తలను ఖండించాడు. అయితే ఇటీవల వినాయక్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘సీనయ్య’ చిత్రం పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.’ ‘సీనయ్య’ చిత్రం వస్తుందో రాదో తెలియదు’ అని వినాయక్ కామెంట్ చేశాడు.
ఈ మాస్ డైరెక్టర్ మాటలను బట్టి చూస్తే సినిమా ఆగిపోయినట్టే అని స్పష్టమవుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వినాయక్ ‘లూసిఫర్’ రీమేక్ తో తిరిగి డైరెక్టర్ గా కొనసాగాలని డిసైడ్ అయినట్టు కూడా డిస్కషన్లు జరుగుతున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!