వినాయక్ పరిస్థితి చూస్తే జాలేస్తోంది

ఆది.. దిల్.. అదుర్స్.. వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి వివి వినాయక్ స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితోను ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. అయినప్పటికీ ఇతని పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదు. అతని చుట్టూ క్యూ కట్టే హీరోలు లేరు. పిలిచి అవకాశమిచ్చే నిర్మాతలు కరువయ్యారు. కొత్త దర్శకుడిలా నిర్మాణ సంస్థల ఆఫీస్ ల చుట్టూ తిరిగే ఓపిక వినాయక్ కి లేదు. అందుకే అతన్ని చూసి అందరూ జాలి పడుతున్నారు. అఖిల్ మూవీ వినాయక్ క్రేజ్ ని పూర్తిగా పడేసింది. ఆ తర్వాత ఖైదీ నంబర్ 150 వినాయక్ పై మంచి అభిప్రాయం కలగజేస్తే.. దాన్ని క్రెడిట్ మాత్రం ఒరిజినల్ కథ (తమిళ) డైరెక్టర్ కే చెందింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటిలిజెంట్ మాత్రం బాగా దెబ్బ తీసింది.

యువ హీరోలు వినాయక్ వైపు చూసేందుకు భయపడుతున్నారు. అందుకే బాలయ్యతో సినిమా చేయాలనీ ప్లాన్ చేశారు. సి. కల్యాణ్ నిర్మించనున్న ఈ మూవీ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. క్రాంతి, “ఎకే 42” అనే టైటిల్స్ పరిశీలించినట్లు హడావిడి చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలిసింది. గతంలో వినాయక్ బర్త్ డే అంటే.. తనతో కమిట్మెంట్లు ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవాళ్లు. సినిమాలు అనౌన్స్ చేసేవాళ్లు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు. సి.కళ్యాణ్ విష్ చేస్తూ ప్రకటన ఇచ్చాడు కానీ.. అందులో సినిమా ఏమీ ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే వినాయక్ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టేట్టు ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus