బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేస్తోన్న వినాయక్

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ క్రిష్ దర్శకత్వంలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కైకాల సత్యనారాయణ, విద్యాబాలన్, రానా, సుమంత్, ఆమని వంటి స్టార్ హీరో, హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రానుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ… వివి వినాయక్ దర్శకత్వంలో నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై వినాయక్ తాజాగా స్పందించారు. తన నెక్స్ట్ సినిమా బాలయ్యతోనే అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సి. కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. బాలయ్యకు ఫ్యాక్షన్ కథలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాయి. అలాగే వినాయక్ తొలి సినిమానే రాయలసీమ నేపథ్యంలో తీసి అదరగొట్టారు. సో ఇద్దరికీ ఫ్యాక్షన్ కథ కలిసొస్తుందని నమ్మకం ఉంది. గతంలో వీరికలయికలో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. అంతేకాకుండా ఖైదీ నంబర్ 150 తర్వాత సాయి ధరమ్ తేజ్ తో చేసిన “ఇంటెలిజెంట్‌” ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలనే కసితో వినాయక్ ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus