రీరిలీజ్‌ చేయడం లేదు కానీ నోటీసులు ఇస్తున్నారు… ఎందుకని?

  • October 12, 2023 / 02:31 PM IST

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సంబంధించి వైజయంతి మూవీస్‌ టీమ్‌ ఇటీవల ఓ బహిరంగ ప్రకటన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఓ పెద్ద లేఖ ద్వారా వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు. మొత్తంగా ఆ నోటీసు అంతా చూస్తే… ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ సినిమా, అందులోని పాత్రలు, విషయాలు… ఇలా అన్నీ తమ సొంతం అని, ఎవరూ వాడటానికి వీల్లేదని క్లియర్‌గా చెప్పేశారు. అయితే ఇక్కడ క్లారిటీ లేని అంశం ‘ఎవరికి ఆ వార్నింగ్‌?’ అని. అలాగే ఎందుకు అని.

చిరంజీవి లాంగ్‌ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాది ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో సినిమా సృష్టించిన రికార్డులు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి జోడీ.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ… ఇంద్రలోకం – భూలోకం కాన్సెప్ట్‌… ఇలా అన్నీ అద్భుతం. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను సీక్వెల్‌ వస్తుందని, ప్రీక్వెల్‌ తీస్తారని, రీమేక్‌ చేస్తారని, వెబ్‌ సిరీస్‌ స్టైల్‌లో రావొచ్చని ఇలా చాలా రకాల వార్తలొచ్చాయి. వాటి సంగతి పక్కనపెడితే… ఈ సినిమాను 4కె వెర్షన్‌లో సిద్ధం చేసి రీరిలీజ్ చేయాలనే వినతులు చాలానే వచ్చాయి. కానీ నిర్మాణ సంస్థ ఇంతవరకు ఆ పని చేయలేదు. కానీ ఏమైందో ఏమో హఠాత్తుగా సినిమా హక్కులు మావే అంటూ ఓ నోటీసు రిలీజ్‌ చేశారు. దీంతో అసలేమైంది అంటూ ప్రశ్నలు రావడం మొదలయ్యాయి.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాకు దగ్గరగా ఎవరైనా సినిమా తీసినా, ఎలాంటి కంటెంట్‌ రూపొందించినా… లీగల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో నిర్మాణ సంస్థ పేర్కొంది. సినిమా హక్కులు తమ దగ్గరే ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అందరికీ తెలిసిందే కదా అనే డౌట్‌ వస్తోంది చాలామందికి. మొత్తంగా ఈ వ్యవహారంలో రెండు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘జగదేకవీరుడు’, ‘ముల్లోక వీరుడు’ అనే పేర్లు అనుకుంటున్నారని టాక్‌. కథ కూడా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని అంటున్నారు. దీంతో ఎక్కడ ఆ సినిమా రిఫరెన్స్‌లు వశిష్ట – చిరంజీవి వాడతారేమో అని ఆశ్వనీదత్ ఇలా నోటీసు ఇచ్చారని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే సినిమాను రామ్ చరణ్‌తో రీమేక్ చేస్తానని ఇప్పటికే అశ్వనీదత్ చెప్పేశారు.

అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్తగా నోటీసు ఇచ్చారని చెబుతున్నారు. ఇకొందరు అయితే ఈ సినిమా తరహాలో ఏదో వెబ్‌ సిరీస్‌ రూపొందుతోందని వార్తలొచ్చాయని అందుకే అశ్వనీదత్‌ ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరికొందరు అయితే సినిమాను 4కె వెర్షన్‌లో విడుదల చేయడానికి ఇతరులు ప్రయత్నం చేయడంతో ముందు జాగ్రత్తగా వైజయంతి మూవీస్‌ ఇలా చేసిందనే కామెంట్సూ ఉన్నాయి. మరి అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus