Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో జ్యూరీమెంబర్స్ పార్షియలిటీ.. గొడవ పడ్డ హౌస్ మేట్స్..! లైవ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో మునుపెన్నడు లేనివిధంగా నామినేషన్స్ ప్రక్రియని పెట్టాడు బిగ్ బాస్. గత మూడు వారాలుగా పవర్ అస్త్రాలని ఇమ్యూనిటీని సంపాదించిన సందీప్, శివాజీ, ఇంకా శోభాశెట్టి ఈ ముగ్గురినీ జ్యూరీ సభ్యులుగా పెట్టాడు. మిగతా హౌస్ మేట్స్ ఇద్దరిని నామినేట్ చేయమని ఆ ఇద్దరి వాద ప్రతివాదనలు విని ఎవరిని నామినేట్ చేస్తారో జ్యూరీ సభ్యులు ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కి చెప్పాలని, వారి ఫోటోని గిల్డీ వాల్ పైన పెట్టాలని చెప్పాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. అయితే, జ్యూరీ సభ్యులు చాలా మిస్టేక్స్ చేశారు. అందులో ముఖ్యంగా మనం కొన్ని చూసినట్లయితే..

నెంబర్ – 1

ప్రిన్స్ యావార్ ప్రియాంకని ఇంకా టేస్టీ తేజని నామినేట్ చేశాడు.చాలాసేపు ఆలోచించిన జ్యూరీ మెంబర్స్ ప్రియాంకని నామినేషన్ బోర్డ్ పైన పెట్టారు. అయితే, ఇక్కడే వాలిడ్ పాయింట్స్ పైన ఆర్గ్యూమెంట్స్ ని ఖచ్చితంగా వినలేకపోయారు. అలాగే, వారి పర్సనల్ ఓపీనియన్స్ కూడా ఇక్కడ డిస్కషన్ చేశారు. ఇంకా ప్రిన్స్ ని నామినేట్ చేసేటపుడు జ్యూరీ సభ్యులపైకి వచ్చాడనే రీజన్ తో నామినేట్ చేశారు. దీనికి బిగ్ బాస్ మీ రీజన్స్ ఉండకూడదు అని కేవలం హౌస్ మేట్స్ చెప్పిన పాయింట్స్ పైన మాత్రమే నామినేట్ చేయమని చెప్పాడు. మళ్లీ తిరిగి ప్రిన్స్ నామినేషన్ ని తీస్కోవాల్సి వచ్చింది.

నెంబర్ – 2

శుభశ్రీ చెప్పిన పాయింట్స్ కి ఎటూ తేల్చుకోలేకపోయారు జ్యూరీ మెంబర్స్. రతిక విషయంలో, అమర్ విషయంలో ఎవరిని నామినేట్ చేయాలో తెలియక ఇద్దరి ఫోటోలు బోర్డ్ పైన పెట్టారు. అప్పుడు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరో ఒకరినే నామినేషన్ లోకి తీస్కుని రావాలని హెచ్చరించాడు. దీంతో రతికని నామినేట్ చేసి అమర్ ని వదిలేశారు. అమర్ ఇంకా శుభశ్రీ అయితే చాలా సేపు ఆర్గ్యూ చేసుకుంటునే ఉన్నారు.

నెంబర్ – 3

అమర్ నామినేషన్స్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ ఇంకా శుభశ్రీ ఇద్దరినీ బోన్ లో నుంచో పెట్టాడు. తన వాదనని వినిపించాడు. పల్లవి ప్రశాంత్ తో దారుణంగా ఆర్గ్యూమెంట్ కి దిగాడు. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఇక శుభశ్రీ అయితే తనని నామినేట్ చేసిందనే ఒకే ఒక రీజన్ చెప్పాడు. అలాగే నేను తన మాటలకి హర్ట్ అయ్యానని చెప్పాడు. ఇక్కడ జ్యూరీ మెంబర్స్ పెద్ద తప్పు చేశారు. శుభశ్రీని నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చారు. దీంతో శుభశ్రీ రెచ్చిపోయింది. అలా ఎలా డెసీషన్ తీస్కుంటారు ఇది చాలా అన్ ఫైయిర్ అంటూ వాదించింది. జ్యూరీ మెంబర్స్ శుభశ్రీ విషయంలో రాంగ్ డెసీషన్ తీస్కున్నారు.

నెంబర్ – 4

పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో భాగంగా అమర్ ని ఇంకా గౌతమ్ ని ఇద్దరినీ నామినేట్ చేశాడు. అక్కడ అమర్ పాయింట్స్ వాలిడ్ గా ఉన్నా కూడా జ్యూరీ మెంబర్స్ పట్టించుకోలేదు. గౌతమ్ ని నామినేట్ చేశారు. అంతేకాదు, బాడీ షేప్ లాగా సైగ చేయడం పెద్ద తప్పు అని, ప్రశాంత్ నీ మాట పైన నువ్వు నిలబడతావా లేదా అని నిలదీసి మరి నామినేట్ చేశారు. దీంతో గౌతమ్ ఎంత మొత్తుకున్నా వినకుండా నామినేట్ చేసేశారు.

నెంబర్ – 5

నామినేషన్ ప్రక్రియలో జ్యూరీ మెంబర్స్ లో ఉన్న శివాజీ హౌస్ మేట్స్ తో సేఫ్ గేమ్ ఆడాడా అని అనిపించింది. ముఖ్యంగా రతిక విషయంలో జ్యూరీ మెంబర్స్ ని ఎదిరించాడు. చాలాసేపటి తర్వాత కాంప్రైమైజ్ అయ్యాడు. అంతేకాదు, సందీప్ ని బాగా తన మాటలతో ఇన్ఫులెన్స్ చేశాడు. ఇక జ్యూరీ మెంబర్స్ రెండు సార్లు టేస్టీ తేజని నామినేషన్స్ లోకి రాకుండా చేశారు. దీంతో తేజ ఊపిరి పీల్చుకున్నాడు.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus