టాలీవుడ్ ‘టామ్&జెర్రీ’ కొత్త రగడ!!!

టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అంటే తెలియని వారు ఉండరేమో…..అదేనండి మన మెగాస్టార్ చిరు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వీళ్ళిద్దరూ తొలి నాళ్ళలో చాలా సినిమాలు కలసి నటించారు. అయితే సినీ ప్రయాణంలో వారిద్దరి మధ్య ఎలాంటి పరిచయం, స్నేహం, శతృత్వం ఉన్నాయో కానీ, అవకాశం చిక్కినప్పుడల్లా వీళ్ళిద్దరూ ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాగ్వాధానికి దిగిన సంఘటనలు చాలానే చూశాం కానీ మరో సారి వీరిద్దరి మధ్య చిన్న పాటి రగడ జరిగింది…

విషయం ఏమిటంటే… భారతీ ప్రధాన్ అనే రచయిత్రి బాలీవుడ్ టాప్ హీరో శత్రుఘ్నసిన్హా జీవితంపై 7 సంవత్సరాలు పరిశోధన చేసి ‘ఖామోష్’ పేరుతో ఈ పుస్తకాన్ని వ్రాసింది. ఇక ఆ పుస్తక విడుదల కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబులు అతిధులుగా వచ్చారు. ఇక చిరు మాట్లాడుతూ…తనకు శత్రుఘ్న సిన్హా జీవితానికి చాల పోలికలు ఉన్నాయి అంటూ తాను కూడ శత్రుఘ్న సిన్హా లాంటి వాడినే అని కామెంట్ చేసాడు. వెంటనే మోహన్ బాబు ఆ మాటకు కౌంటర్ ఇస్తూ…తన జీవితానికి శత్రుఘ్న సిన్హ జీవితానికీ పోలిక ఉంది కాని ‘అతడిలా మీరు ఎలా అవుతారు’ అంటూ చిరంజీవి పై మోహన్ బాబు సెటైర్లు వేసాడు.

ఇక మోహన్ బాబు మాటలకు చిరు కూడా కౌంటర్ వెయ్యాలిగా….దానిలో భాగంగా తన సినిమా ప్రయాణం శత్రుఘ్న సిన్హా సినిమా ప్రయాణం నెగిటివ్ పాత్రలతో మొదలైంది అంటూ చిరు రివర్స్ కౌంటర్ వెయ్యగా….మోహన్ బాబు నోరు కుదురు ఉండదు కదా….ఆయన మళ్లీ లేచి ‘నా జీవితం కూడా ప్రతినాయక పాత్రలతోనే మొదలైంది. కానీ ఇక్కడ ఎవరి శైలి వాళ్లకుంది’ అంటూ చిరంజీవికి చురకలు అంటించాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రగడ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus