Actress: స్టార్ హీరోయిన్ భర్త కు మధ్య గోడవకు అదేనా కారణం..?

ప్రముఖుల జీవిత చరిత్రలు, జీవన విధానాలు ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అందులో సినీ రంగంలో ఉండే వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగిన అది సన్సేషనల్ గా మారుతోంది.. అలాంటి సంఘటన గ్లోబల్ స్టార్ హీరోయిన్ జీవితంలో చోటు చేసుకుంది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. క్రిష్, తుఫాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక హాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉంటే (Actress) ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నిక్ జోనాస్ చేసిన పనికి వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టన్నింగ్ బ్యూటి ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జంషెడ్ పూర్ లో జన్మించింది. మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ సుందరి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.

హిందీలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ సుందరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి జంజీర్ తెలుగులో తుఫాన్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీని తర్వాత తెలుగులో ప్రియాంకకు అవకాశాలు రాలేదు. హిందీలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 2015లో క్వాంటికో అనే టీవీ సిరీసుతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాలు మోపింది ఈ భామ.

ఇందులో FBI ఏజెంట్ అలెక్స్ పారిష్ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. క్వాంటికో మూవీ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రియాంక నటనకు హాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు తన ట్వీట్ లో తెలిపాడు.

అఫైర్.. గొడవలు: “బ్రేకింగ్ న్యూస్.. ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఇటలీలోని రోమ్ లో దారుణంగా గొడవ పడ్డారు. అంతర్గత మూలాల ప్రకారం నిక్ జోనాస్ కు సీక్రెట్ అఫైర్ ఉంది. అలా సీక్రెట్ అఫైర్ సాగిస్తున్న భర్త నిక్ జోనాస్ ను ప్రియాంక చోప్రా పట్టుకుంది. వాళ్లిద్దరి మధ్య అంతా సజావుగా సాగడం లేదు. మనస్పర్థలు చోటు చేసుకున్నాయి” అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు ఉమర్ సంధు. దీంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. కానీ ఈ మధ్య ఉమర్ సంధు అన్నీ ఇలాంటి గాసిప్ ట్వీట్స్ పెడుతూ సెలబ్రిటీలుగా తలనొప్పిగా మారాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus