అప్పుడు ఆమె సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఈమె పగ తీర్చుకొంటోంది
- April 30, 2019 / 07:22 PM ISTByFilmy Focus
ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడి ఇప్పటికీ ఎందుకని అంత ఫేమస్సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే తెలిసొస్తుంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఒక అంశం ఆ విషయాన్ని ప్రూవ్ చేసింది. అప్పట్లో “పద్మావతి” సినిమా టైమ్ లో కొన్ని వర్గాలు దీపికా పడుకొనే మీద దాడి చేస్తున్న తరుణంలో ఆమెను కాపాడడం కోసం బాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీలందరూ ఒక పిటిషన్ వేయగా.. దానికి కంగనా రనౌత్ తప్ప అందరూ సైన్ చేశారు.
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆ విషయాన్ని దీపికా మనసులో పెట్టేసుకొన్నట్లు ఉంది. అందుకే.. కంగనా కొత్త చిత్రం “మెంటల్ హై క్యా” అనే సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. సినిమా టైటిల్ మార్చాలని దీపికా పడుకొనేకి సంబంధించిన ఓ సంస్థ పిటిషన్ వేసింది. దాంతో ఇప్పుడు టైటిల్ మార్చేవరకూ సినిమా రిలీజ్ చేయడం కుదరదు. ఆ విధంగా దీపికా-కంగనా నడుమ కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉందనే విషయం క్లియరైంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












