‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లకు కరెక్ట్ గా సూట్ అయ్యే స్టార్ ట్యాగ్స్ ఇవే..!

  • September 18, 2020 / 05:48 PM IST

‘బిగ్ బాస్4’ మొదలయ్యి వారం పైనే అవుతుంది.హోస్ట్ నాగార్జున గారు శని, ఆదివారాల్లో వచ్చి కంటెస్టెంట్ లను గైడ్ చెయ్యడం కూడా జరిగింది. మొదటి వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఇప్పటి వరకూ చూసిన ఎపిసోడ్స్ ను బట్టి ప్రేక్షకులందరికీ ఏ కంటెస్టెంట్ ఎలా ప్రవర్తిస్తాడు అనే ఐడియా వచ్చేసింది. అందుకే వాళ్ళ పై మీమ్స్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.అంతేకాదు కంటెస్టెంట్ ల ప్రవర్తనను ఆధారం చేసుకుని అప్పుడే వాళ్లకు స్టార్ ట్యాగ్లు కూడా ఇచ్చేసారు. మరి మెజారిటీ ప్రేక్షకులు ఏ కంటెస్టెంట్లకు ఎలాంటి స్టార్ ట్యాగ్లు ఇచ్చారో.. వాళ్లకు అది ఎలా సెట్ అయ్యిందో ఓ లుక్కేద్దాం రండి :

1) దివి : సైలెంట్ స్టార్


ఇప్పటి వరకూ ఈమె హౌస్ లో ఈమె మాట్లాడిన సందర్భాలను వేళ్ళ పైనే లెక్కేసి చెప్పొచ్చు.

2) నోయెల్ : సింగింగ్ స్టార్


చిన్న గ్యాప్ ఇచ్చినా.. చిన్న గ్యాప్ వచ్చినా, ర్యాప్ లు.. సాంగ్ లతో చెలరేగిపోతాడు నోయల్.

3) మెహబూబ్ దిల్ సే : ఫిట్నెస్ మరియు డ్యాన్సింగ్ స్టార్


ఎప్పుడూ జిమ్ ఏరియాలోనే కనిపిస్తాడు.. డ్యాన్స్ చెయ్యాల్సి వస్తే టాప్ లేపేస్తుంటాడు.

4) హారిక : యాక్టివ్ స్టార్


టాస్కులు, డ్యాన్స్ వంటి వాటిలో యాక్టివ్ గా ఉంటుంది.

5) అమ్మ రాజశేఖర్ : ఎంటర్టైనింగ్ అండ్ డ్యాన్సింగ్ స్టార్


జోక్స్ తోనూ, డ్యాన్స్ తోనూ ఎంటర్టైన్ చేస్తుంటాడు.

6) కరాటే కళ్యాణి : అయోమయం స్టార్


ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు.

7) అభిజీత్ : కూల్ స్టార్


ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. తన పని తను కూల్ గా చేసుకుపోతుంటాడు .

8) ఆరియానా : బోల్డ్ స్టార్


‘బోల్డ్’ అనే పదాన్ని ఎక్కువగా కలవరిస్తుంటుంది. అందుకే బోల్డ్ స్టార్.

9) మోనాల్ గజ్జర్ : ఎమోషనల్(క్రైయింగ్) స్టార్


ఇంట్లోకి ఎవరు వచ్చినా మంచినీళ్లు ఇస్తుంది.. అలాగే ఎక్కువగా ఏడుస్తుంది.

10) సోహైల్ : ఇస్మార్ట్ స్టార్


స్మార్ట్ గా ఏదో ఆడేద్దాం అనుకుంటాడు.

11) లాస్య : లక్కీ స్టార్


లక్కీ గా ఫస్ట్ కెప్టెన్ అయ్యిపోయింది.

12) అఖిల్ : డ్యాన్స్ రాని స్టార్


డ్యాన్స్ చెయ్యలేక ఫాంట్ వంకతో ఎస్కేప్ అయినందుకు ఈ స్టార్ ఇచ్చేసారు.

13) సూర్య కిరణ్ : యాంగ్రీ స్టార్


సీతయ్యలాగా ఎవ్వరి మాటా వినడు. అందుకే వెంటనే ఎలిమినేట్ అయిపోయాడు.

14) దేవి : స్ట్రాంగ్ స్టార్


అబ్బో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

15) సుజాతా : హానెస్ట్ స్టార్


చాలా నిజాయితీగా ఉంటుంది.. ఆడుతుంది.

16) గంగవ్వ : మాస్ స్టార్


హౌస్లో ఉన్న వాళ్ళ అభిమానాన్ని.. షో చూస్తున్న ప్రేక్షకులు అభిమానాన్ని పొంది మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus