Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?
- June 27, 2026 / 04:53 PM ISTByFilmy Focus Desk
మొన్నీ మధ్య ఓ సినిమా కోసం హీరో ఐదారు క్యారవాన్‌లు అడిగాడు అంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని చిత్రబృందం అధికారికంగా ఓ ప్రకటన ఇచ్చారు. ఇదే సమయంలో ఓ సినిమా కోసం 50 వ్యానిటీ వ్యాన్స్ వాడారు అనే వార్త బయటకు వచ్చింది. అంతేకాదు ఆ సినిమాకు 250 కార్లు కూడా వాడారట. ఆ సినిమానే ‘వెల్ కమ్ టు ది జంగిల్’. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, దిశా పఠానీ, జాక్వైలైన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ చిత్రమిది.
Welcome to the Jungle
జూన్ 26న విడుదల కానున్న ఈ సినిమా ‘వెల్‌కమ్’ సిరీస్‌లో వస్తున్న మూడో సినిమా. ఇందులో దాదాపు 34 మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. సినిమాలో సినిమా కాన్సెప్ట్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా గురించి దర్శకుడు అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తెరపై కేవలం 34 మంది నటీనటులే కనిపించినా.. తెర వెనుక ఉన్న వారితో కలిపితే నటీనటుల టీమే 150 మంది.
200 మంది టెక్నికల్ టీమ్, స్టంట్ టీమ్, 150 మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లు కూడా సినిమాకు పని చేశారు. అలా ఒక్క రోజు సెట్‌లో 900 మంది వరకు ఉండేవారు. వీరందరి కోసం రెండు పెద్ద గ్రౌండ్‌లు సిద్ధం చేశారట. అక్కడ 50 వ్యానిటీ వ్యాన్‌లు పెట్టారట. ఇక వారందరూ రావడానికి, వెళ్లడానికి 250 కార్లు ఉండేవట. వాటి పార్కింగ్‌కి ఇంకో పెద్ద ప్లేస్ చూశారట. ఈ క్రమంలో కొంతమంది నటుల డేట్స్ సంఖ్య కూడా పెరిగిందట.
బాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందిన అతి భారీ సినిమాల్లో ఇదొకటి. బాలీవుడ్ అగ్ర నటులు, టీవీ నటులు, ఓటీటీ నటులు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా ఫలితం ఆ సినిమా టీమ్‌కే కాదు.. మొత్తం బాలీవుడ్‌కి కీలకంగా మారింది.
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్ వైరల్
















