గత ఏడాది టాలీవుడ్ నుండి రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల అయ్యాయి. ఒకటి ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ బయోపిక్ సైరా నరసింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ మధ్య కాలంలో సాహో సినిమాకు వచ్చినంత హైప్ మరో చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిందీలో హిట్ కాగా, తెలుగు మరియు సౌత్ లాంగ్వేజ్ లలో పరాజయం పొందింది.
ఇక దర్శకుడు సురేంధర్ రెడ్డి రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు 250కోట్ల రూపాయల ఖర్చుతో ఐదు భాషలలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి గా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలించింది. ఐతే ఇతర బాషలలో మాత్రం అంతగా ఆదరణ దక్కించుకోలేదు. మరి సాహో దర్శకుడు సుజీత్, సైరా దర్శకుడు ఇప్పటి వరకు తదుపరి చిత్రం ప్రకటించలేదు. సుజీత్ హీరో శర్వానంద్ తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సురేంధర్ రెడ్డి స్టార్ హీరోలకు కథలు వినిపించే పనిలో ఉన్నారు.
Most Recommended Video
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక చిన్న విరామం & రేటింగ్!