సెట్స్ మీద, చర్చల్లో ఎక్కువ సినిమాలు ఉన్న హీరో అభిమానులకు.. ఆ హీరో పుట్టిన రోజంటే పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆ హీరోతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు అప్‌డేట్స్ ఇస్తారు. సినిమాలు చేద్దాం అనుకునే నిర్మాతలు బర్త్ డే పోస్టర్లు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు పైన చెప్పిన ఫీలింగ్‌లో ఉన్న అభిమానులు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ ఫ్యాన్సే. ఎందుకంటే ఈ నెలలోనే డార్లింగ్ బర్త్ డే ఉంది. ఈ నెల 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఏయే అప్‌డేట్స్ రావొచ్చనేది చూద్దాం.
ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే.. తొలుతగా రాబోయే సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్, ఓ ట్రైలర్ వచ్చేశాయి. కాబట్టి ఇక రావాల్సింది సింగిల్ మాత్రమే. ప్రస్తుతం దర్శకుడు మారుతి ఇదే పనిలో ఉన్నారట. మరి పాట ఇస్తారో.. పాట టీజర్ ఇస్తారా అనేది చూడాలి. అది కాకుండా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఫౌజీ’ అనే పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమా నుండి ఓ గ్లింప్స్ వస్తుందని సమాచారం. ఎందుకంటే సినిమాకు సంబంధించి కావాల్సినంత ఫుటేజ్ షూటింగ్ అయింది.
ఇక ఈ సినిమాను 2026 ఆగస్టు రెండో వారంలో విడుదల చేస్తారని సమాచారం. కాబట్టి గ్లింప్స్ నిడివి చాలా తక్కువే ఉండొచ్చని టాక్. ఈ రెండూ కాకుండా ప్రభాస్ చేతిలో ఇంకా ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమాలున్నాయి. ఇవేవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కాబట్టి వీరి నుండి ఫుటేజ్ ప్రమోషన్ కంటెంట్‌ను ఆశించలేం. అయితే సుకుమార్ డైరక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడని, ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మరాక్షస’ చేస్తాడని వార్తలొస్తున్నాయి. వారి నుండి విషెష్ పోస్టర్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
అలాగే, హోంబలే పిక్చర్స్ బ్యానర్ మీద మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది ప్రభాస్. మరి వాళ్లేమన్నా వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి.