హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హీరోయిన్‌ పెళ్లి.. ఇండియన్‌ సినిమాలో పుకార్లకు ఇంతకుమించిన పెద్ద సోర్స్‌ ఇంకొకటి లేదు అని చెప్పాలి. పెళ్లి వయసు రాగానే, సినిమా ఛాన్స్‌లు తగ్గగానే, తన తోటి హీరోయిన్‌కి పెళ్లి అయినప్పుడు / అవుతుంది అన్నప్పుడు.. ఇలా వివిధ సందర్భాల్లో పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లి వయసు చాలా ఏళ్ల క్రితమే వెళ్లిపోయిన వారికి అయితే ఈ పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. వారానికోసారి పెళ్లి కబుర్లు పుకార్లలా వచ్చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖ కథానాయిక త్రిష కూడా ఉంది.

Trisha

చాలా ఏళ్లుగా త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓసారి దానిని నిజం చేస్తూ ఆమె ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. కానీ అనూహ్యంగా ‘మేం పెళ్లి చేసుకోవడం లేదు’ అంటూ అనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చింది. దానికి ముందు, ఆ తర్వాత కొంతమంది నటులతో ఆమె ప్రేమ వ్యవహారాలు బయటకు వచ్చాయి. అవన్నీ తేలే వ్యవహారాలు కావు అని అభిమానులు అనుకుటుండగా కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త సంగతి తర్వాత చూద్దాం.. దానికి త్రిష ఇచ్చిన రిప్లై ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

నా కోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న వాళ్లను నేను ప్రేమిస్తాను. మరెందుకు ఆలస్యం పనిలో పనిగా నా హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా చెబుతారేమో అని చూస్తున్నా అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది త్రిష. తద్వారా తాను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పకనే చెప్పింది. చండీఘడ్‌కి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తను త్రిష పెళ్లి చేసుకోనుంది అనేది లేటెస్ట్‌ రూమర్‌. వాటికి రిప్లైగానే త్రిష పై కామెంట్లు చేసింది. ఇక త్రిష సినిమాల సంగతి చూస్తే.. ఈ ఏడాది ‘ఐడెంటిటీ’, ‘విదాయుమురిచ్చి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, ‘థగ్‌లైఫ్‌’ సినిమాలతో వచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో సూర్య ‘కరుప్పు’, చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలు ఉన్నాయి.

‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus