వంశీని పక్కన పెట్టి.. వెంకీకి ఛాన్స్ ఇస్తున్న నితిన్!

  • March 10, 2023 / 04:02 PM IST

నాలుగైదు హిట్టు సినిమాలకు పనిచేసిన రచయితలకు స్టార్ హీరోలు వెంటనే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే వక్కంతం వంశీ డైరెక్టర్ అవ్వడానికి ఓ యుద్ధమే జరిగినట్టు అయ్యింది. ఎన్టీఆర్ తో తన మొదటి సినిమా చేయాలనుకున్నాడు వంశీ. కానీ ఆ కథ నచ్చకపోవడం వల్లనో ఏమో మరి.. ఎన్టీఆర్ తో సినిమా వర్కౌట్ అవ్వలేదు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు. అలా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.

అయితే ఓ రైటర్ .. తన మొదటి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రతి ఫ్రేమ్ లోనూ.. అతని పెన్ పవర్ కనిపిస్తుంది. కానీ ‘నా పేరు సూర్య..’ సినిమా విషయంలో వంశీ డైరెక్టర్ గా ఓకే అనిపించాడు కానీ రైటర్ గా ఫెయిల్ అయ్యాడు. గతంలో వచ్చిన ‘వజ్రం’ .. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలను మిక్స్ చేసి తీసినట్టు ఆ సినిమాని తీశాడు. అందుకే ఫలితం తేడా కొట్టింది… రెండో సినిమాకి స్టార్ హీరో దొరకలేదు.

ఈ క్రమంలో మిడ్ రేంజ్ హీరో అయిన నితిన్.. వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రారంభమైంది. కానీ మధ్యలో ఆగిపోయింది. సెకండ్ హాఫ్ విషయంలో నితిన్ సంతృప్తి చెందకపోవడంతో వంశీకి టైం ఇచ్చి మార్పులు చేయమన్నట్టు కథనాలు వినిపించాయి.అయితే మరోపక్క వంశీకే సెకండ్ హాఫ్ విషయంలో కాన్ఫిడెన్స్ లేకపోవడంతో మళ్ళీ స్క్రిప్ట్ పై వర్క్ మొదలుపెట్టినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

రెండో సినిమా ఫలితం కూడా తేడా కొడితే వంశీకి డైరెక్షన్ ఛాన్స్ తొందరగా రాకపోవచ్చు. అందుకే లేటైనా పర్వాలేదు.. స్క్రిప్ట్ బాగా రావాలి అనుకుంటున్నాడు. మరోవైపు నితిన్ ఖాళీగా ఉండకుండా తనకు ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus