బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ ఆరంభం అయ్యింది. ఇందులో భాగంగా సీనియర్స్ ని వారియర్స్ గా, జూనియర్స్ ని ఛాలెంజర్స్ గా విభజించాడు బిగ్ బాస్. అంతేకాదు, సీనియర్స్ అయిన వారియర్స్ హౌస్ లో వసతులు పొందాలంటే యాక్సెస్ పొందిన ఛాలెంజర్స్ పై ఆధారపడాల్సిందే. అలా యాక్సెస్ పొందిన ఛాలెంజర్స్ ఒక్కో వసతిని వారియర్స్ కి కల్పిస్తారు. అంతేకాదు, ఇంటికి సంబంధించిన పనులని కూడ వారియర్స్ మాత్రమే చేయాలని కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. దీనికోసం వారియర్స్ కి డ్యూటీస్ వేశారు ఛాలెంజర్స్.
ఇక మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా ఒక్కో ఛాలెంజర్ ఇద్దరు వారియర్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు సీనియర్స్ ని ఎంచుకుని తగిన కారణాలు చెప్తూ వాళ్లకి సూట్ అయ్యే ట్యాగ్ ని వారి మెడలో వేయాలి. యాంకర్ శివతో ఈ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. అంతేకాదు, ఇక్కడే చాలామంది ఒకరినే టార్గెట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో సీనియర్స్ మాత్రమే నామినేషన్స్ లో ఉంటే వీరిలో ఒకరు ఇంటి నుంచీ బయటకి వెళ్లక తప్పదనే అనిపిస్తోంది.
వారి ఫ్యాన్ పాలోయింగ్ ని బట్టీ ఇప్పుడు సీనియర్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈవారం చాలా ఇంట్రస్టింగ్. కానీ, నామినేషన్స్ లో ఈవారం కేవలం సీనియర్స్ మాత్రమే ఉంటారా లేదా ఛాలెంజర్స్ నుంచీ కూడా ఒకరిద్దరు ఉంటారా అనేది ఎపిసోడ్ 4 స్ట్రీమింగ్ లో తెలిసిపోతుంది.