మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారా?

  • October 19, 2018 / 11:14 AM IST

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని రోజుల క్రితం  “తిత్లీ” తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుపాను బాధితులను ఆదుకోనేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. సంపూర్ణేష్ బాబు 50 వేలు, విజయ్ దేవరకొండ లు 5లక్షలను, ఎన్టీఆర్ 15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ 5 లక్షలు, అనిల్‌ రావిపూడి కూడా లక్ష రూపాయలు,  వరుణ్ తేజ్  5 లక్షలు విరాళంగా ప్రకటించారు. యంగ్ హీరో నిఖిల్ అయితే  తిల్లీ తుఫాను వ‌ల్ల దెబ్బ తిన్న ప్రాంతాల‌కు నేరుగా వెళ్ళి వారికి స‌హాయం అందించారు. కానీ స్టార్ హీరోలైన మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సాయం అందించడానికి ముందుకు రాలేదు. అదే పక్కరాష్ట్రాలైనా  కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. వెంట‌నే స్పందించి భారీగా విరాళాలు ఇచ్చారు.

సొంత రాష్ట్ర‌మైన ఏపీకి క‌ష్ట‌మొస్తే మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఎందుకు అలా చేస్తున్నారు.. అనే దానిపై భిన్న స్వరాలూ వినిపిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో తమ గురించి తెలియాలని ప్రచారం కోసం విరాళం అందిస్తున్నారు. అక్కడ తమ సినిమాలు విజయం సాధించాలని ఆశతోనే ముందు ఉంటారని కొంతమంది విమర్శిస్తున్నారు. భారీ విపత్తులు ఎక్కడ జరిగినా స్టార్ హీరోలు ముందుంటారని.. ఇదివరకు మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు చాల సాయం చేసారని.. ఇప్పుడు ఆలస్యమయిందని అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదిఏమైనా సొంత రాష్ట్రానికి సాయం చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus