బిగ్‌బాస్ 4: వీళ్లు తెలివిగా ఆడారా… వాళ్లు తెలివిగా దిగారా!

  • September 16, 2020 / 01:45 PM IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్‌ అంటే… జబర్దస్త్‌ వినోదాన్ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ప్రేక్షకులు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నువ్వు అలా చేశావ్‌, నువ్వు ఇలా చేశావ్‌ అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. మజా ఉంటుంది, మస్తీ ఉంటుంది, ఎమెషన్స్‌ ఉంటాయి. అయితే నిన్న జరిగిన నామినేషన్‌ అస్సలు అలా సాగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ సేఫ్‌ గేమ్‌ ఆడేశారు.

ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే వాళ్ల కోసం బిగ్‌బాస్‌ పడవ ప్రయాణం కాన్సప్ట్‌ సిద్ధం చేశాడు. పడవలో అందరినీ ఎక్కించి, ఒక్కో తీరం దగ్గర ఒకరిని దిగమన్నాడు. అలా దిగినవాడు నామినేట్‌ అయినట్లు అని చెప్పాడు. అలా తొమ్మిది తీరాల్లో తొమ్మిదిసార్లు పడవ ఆగుతుందని, ఆగి హారన్‌ కొట్టినప్పుడు పడవ దిగాలని సూచించాడు. అయితే టాస్క్‌ మధ్యలో దిగిపోయినవాళ్లు కూడా నామినేట్‌ అవుతారని బిగ్‌ బాస్‌ చెప్పాడు.

పడవలో అందరూ చర్చించుకొని ఒక్కొక్కరుగా దిగాలని తొలుత నిర్ణయించుకున్నారు. అలా తొలుత నోయల్‌ పడవ దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఎలిమినేషన్‌లో నిలవడానికి అంగీకరించాడు. అయితే మధ్యలో గంగవ్వ ‘నువ్వు ఆగు..’ అని దిగిపోయింది. ఎట్లయినా 9 మంది దిగాలి కదా… అని నేను ముందు దిగేశా అంటూ ఫుల్‌ క్లారిటీతో గేమ్‌ ఆడేసింది గంగవ్వ. అలా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి గంగవ్వ, నోయల్‌, మోనాల్‌, సోహైల్‌, కళ్యాణి, రాజశేఖర్‌, కుమార్‌, హారిక, అభిజీత్‌ దిగేసి నామినేట్‌ అయ్యారు.

ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. గత బిగ్‌బాస్‌ సీజన్లలో ఇలాంంటి నామినేషన్‌ ప్రాసెస్‌లు కొన్ని జరిగాయి. కారు, రిక్షా అంటూ కొన్ని నామినేషన్‌ ప్రాసెస్‌లు పెట్టారు. అప్పుడు అందరూ చర్చించుకొని ఒక్కొక్కరు దిగేవారు. ఈ చర్చలో ఎమెషన్స్‌, డ్రామా, ఫన్‌ బయటకు వచ్చేవి. ఒకవేళ చర్చలతో వీలుకాకపోతే… వాళ్లకు వాళ్లే నేచుర్‌ కాల్స్‌ వచ్చినప్పుడు దిగిపోయేవారు. అందులోనూ కొన్ని ట్రిక్స్‌ పాటించేవారు. గతంలో ఒకసారి రిక్షా టాస్క్‌లో చూశాం. ఇంకా లేదంటే ఒకరినొకరు బయటకు తోసుకునేవారు. అయితే ఈసారి దానికి భిన్నంగా సాగిపోయింది.

టాస్క్‌ మొదలవుతున్న సమయంలో ప్రేక్షకులు ఈ రోజు మజా పక్కా అనుకున్నారు. అయితే నోయల్‌ దానికి మొదట్లోనే గండి కొట్టేశాడు. ‘నేనే ముందు దిగిపోతాను’ అంటూ దిగబోయాడు. అయితే గంగవ్వ దిగేసింది. అయితే అప్పటికే అందరూ గంగవ్వ అంతసేపు కూర్చోలేదు కాబట్టి దింపేద్దాం అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత నోయల్‌ దిగేశాడు. తర్వాత ఒకరికొకరు దిగిపోవడం మీకు తెలిసిందే. మొత్తం ప్రాసెస్‌లో కుమార్‌ సాయి విషయంలోనే మాత్రమే డ్రామా నడిచింది. ఇలా ఎలాంటి ఉపయోగం లేని నామినేషన్‌ పెట్టడం వృథా అనేది అభిమానుల మాట.

పడవ నుండి బయటకు దిగినవారు తెలివిగా ఆలోచించారా… లేక ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండి పడవలో ఉండిపోయిన వారు తెలివిగా ఆలోచించారా అంటే ఇద్దరూ ఆలోచించారు అని చెప్పొచ్చు. బయటకు దిగినవారికి ప్రేక్షకుల్లో సింపతీ ఉంటుంది. అయితే అలాంటి సింపతీ తక్కువ పొందినవారు బయటకు వెళ్లిపోతారు. అలా అని పడవలో ఉండిపోయినవారు వెళ్లరా.. అంటే వచ్చే నామినేషన్‌లో వాళ్లు కార్నర్‌ అవుతారు. ప్రేక్షకులు కూడా అదే ఆలోచిస్తారు. కాబట్టి ఈ సారి ఆట సింపతీ ప్రధానంగా సాగిపోయింది.

ఇక ఆట విషయానికొస్తే… ఇంట్లో ఇంకా ఎవరికీ అంత బాండింగ్‌ కలగలేదని అర్థమవుతోంది. ఒకవేళ కలిగి ఉంటే నిన్న ఒకరి కోసం ఒకరు శాక్రిఫైజ్‌ చేసుకునేవారు. నామినేషన్‌కు దూరంగా ఉన్నవాళ్లను చూస్తే… అఖిల్‌, ఆరియానా, మెహబూబ్‌, సుజాత, దివి, దేవి నాగవల్లిని చూస్తే ఎవరిలోనూ ఇంకొకరి కోసం త్యాగం చేయడానికి ముందుకొచ్చే ఆలోచన కనిపించలేదు. కారణం ఇంకా వారెవరూ ఇంకో హౌస్‌మేట్‌తో అంతగా రిలేషన్‌ పెంచుకోవడం. బిగ్‌బాస్‌ అంటేనే రిలేషన్‌.. ఎమోషన్‌. అవేవీ ఇంట్లో లేవని నిన్నటి నామినేషన్‌తో తెలిసిపోయింది. ఇలా ఉంటే బిగ్‌బాస్‌ పోను పోను బోర్‌ కొట్టేస్తుంది. బిగ్‌బాస్‌ ఈ విషయాన్ని గమనించి ఏదో ఒకటి చేయాల్సిన సమయం వచ్చింది. మీరేమంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus