Vv Vinayak: వినాయక్‌ ఎక్కడ… ఈ మద్య కనిపించడం లేదేం.. ఏమైంది?

  • May 29, 2024 / 09:11 PM IST

ఆయన సినిమా తీస్తే మాస్‌కే మాస్‌ పూనకాలు వచ్చేవి. ఆయన సినిమా చేస్తే నవ్వుకే పొట్టచెక్కలవుతుంది. అంతలా ఆ రెండు జానర్ల సినిమాల మీద ఆయనకున్న పట్టు అలాంటిది. ఆయనే ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ (V. V. Vinayak). అంతలా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన వినాయక్‌ గతకొన్ని రోజులుగా కామ్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు సినిమాల ఈవెంట్లకు వచ్చిన ఆయన ఇటీవల పూర్తి కనిపించడం లేదు. వినాయక్‌ నుండి ఆఖరిగా వచ్చిన సినిమా హిందీ ‘ఛత్రపతి’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం అందుకోలేదు.

ఆ తర్వాత చిరంజీవితో (Chiranjeevi) ఓ సినిమా చేస్తారు అని టాక్‌ వచ్చినా.. అది ఓకే అవ్వలేదు. ఆయన మరో సినిమా కూడా చేయలేదు. దీంతో సినిమాలకు, ఆయనకు గ్యాప్‌ వచ్చేసింది. అయితే సినిమా ఈవెంట్లకు కాదు. కానీ ఆయన ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఏమైంది అని ఆరాతీస్తే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అంత బాగా లేదని అంటున్నారు. గత కొంత కాలంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అని చెబుతున్నారు.

దీంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కొన్నేళ్ల క్రితం వినాయక్‌ను ప్రధాన పాత్రధారిగా పెట్టి ఓ సినిమా చేయాలని దిల్ రాజు (Dil Raju) ప్లాన్ చేశారు. ‘శీనయ్య’ అంటూ అనౌన్స్‌మెంట్‌ కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా తర్వాత ఎక్కడా చర్చలో లేదు. ఇప్పుడు ఆరోగ్యంపై పుకార్లు వస్తున్నాయి.

ఏ విషయంలో అయినా పుకార్లు కాస్త ఫర్వాలేదు కానీ.. ఆరోగ్యం విషయంలో కాదు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో వినాయక్‌ ఆరోగ్యం పుకార్లలో చెబుతున్నట్లుగా ఇబ్బందిగా ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు అయితే ఆయన గతంలో మాదిరిగా అదిరిపోయే సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. తారక్ (Jr NTR) ఫ్యాన్స్‌ అయితే ‘అదుర్స్‌ 2’ (Adhurs) చేయాలని కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus