ఇండియన్ సినిమా చరిత్రలో అందరు దర్శకులు ఒకవైపు.. జీతూ జోసెఫ్ ఒకవైపు. ఈ మాట కాస్త ఓవర్ హైప్‌లా కనిపించొచ్చు కానీ. ‘దృశ్యం’, ‘దృశ్యం 2 ’ సినిమాలు చూశాక, అందులో ఆయన స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు చూశాక కచ్చితంగా ఈ మాట అంటారు. అందుకే దేశంలో ఇతర సినిమా పరిశ్రమలు తీసుకెళ్లి మరి ఆ కథను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమా సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయం బయటకు వచ్చింది. అదే మూడో ‘దృశ్యం’లో ట్విస్ట్.
అదేంటి.. జీతూ జోసెఫ్ మైండ్‌ను లీక్ చేసేశారా? మూడో ‘దృశ్యం’ మెయిన్ సీన్ వచ్చేసిందా అనుకుంటున్నారా? అంత ఖలేజా ఎవరికీ ఉండదు కానీ.. ఓ వార్త అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముగింపు ట్విస్ట్ ఇదే అంటూ ఓ కథను అల్లేశారు. అది వింటుంటే ఆసక్తికరంగా ఉంది. ఏప్రిల్ 3న సినిమా విడుదలైనప్పుడు ఇదే సీన్‌ని మీరు చూస్తారు అంటూ అంచనాలు వేసేసి చెబుతున్నారు. తన కుటుంబానికి తెలియకుండా దాచి పెట్టిన ఒక విషయం మీద జార్జ్ కుట్టి/ రాంబాబు అంతర్మథమే మూడో ‘దృశ్యం’లో కీలక విషయమట.
రాంబాబు దాచిపెట్టిన సీక్రెటే ఈ సినిమాలో హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఆ సీన్స్ అటు ఇటు కదులుతూ ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యేలా ఉంటుంది అని చెబుతున్నారు. ‘దృశ్యం’ సినిమా కథలు, క్లైమాక్స్‌లు ఆశ్చర్యపరచడం కొత్త విషయమేమీ కాదు. అయితే రాంబాబు ఇప్పుడేం దాచాడు అనేది చూడాలి. అయితే ఆ ట్విస్ట్ మనకు ముందే తెలిసిపోతుంది. రాంబాబు పెద్దన్నయ్య అంటే అసలు వ్యక్తి జార్జ్ కుట్టి ముందే వచ్చేస్తాడు. ఆ తర్వాత రాంబాబు (తెలుగు), విజయ్ (హిందీ) వస్తారు.