Krish Jagarlamudi: గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి శరవేగంగా సినిమాలు.. క్రిష్‌ నెక్స్ట్‌ ప్లానేంటి?

టాలీవుడ్‌ సినిమా సెన్సిబుల్ సినిమాలు చేయాలన్నా, భారీ చిత్రాలను వేగంగా తీయాలన్నా గుర్తొచ్చే దర్శకుల పేర్లలో క్రిష్‌ (Krish Jagarlamudi) పేరు కూడా ఉంటుంది. ‘గమ్యం’, ‘వేదం’ అంటూ ఎమోషనల్‌ కనెక్ట్ సినిమాలు చేసినా.. ‘కంచె’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలు చేసినా ఆయనకే చెల్లింది. అయితే ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడం మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’ సినిమా నుండి ఆయన బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్‌ ఏంటి అనే ప్రశ్నకు ‘ఘాటి’ అనే సినిమాతో ఆన్సర్‌ ఇచ్చారు.

Krish Jagarlamudi

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వస్తోంది. అదే సినిమా చివరిదశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో గుమ్మడికాయ కొట్టేస్తారు అని చెబుతున్నారు. దీంతో వెంటనే నెక్స్ట్‌ ఏంటి? అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఆయన నుండి చాలా రోజులు సినిమాలు రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన వరుస సినిమాలు చేసి గ్యాప్‌ను ఫిల్‌ చేయాలని చూస్తున్నారట.

ఈ క్రమంలో ఇద్దరు యువ హీరోలతో చర్చలు జరుగుతున్నాయని అర్థం. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు ఆ లిస్ట్‌లో ఉన్నారు అని చెబుతున్నారు. అనుష్క ‘ఘాటీ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌, రిలీజ్‌ పనులు అయ్యేలోపు హీరోను ఫైనల్‌ చేసుకుంటారు అని అంటున్నారు. అయితే ఎలాంటి కథతో చేస్తారు అనేదే ప్రశ్న. క్రిష్‌ చేసిన గత సినిమాలు చూస్తే.. పెద్ద హీరోలతో భారీ సినిమాలు చేస్తుంటారు.

తర్వాతి తరం హీరోలతో ఎమోషనల్‌ కంటెంట్‌, బంధాలు – బాంధవ్యాల కంటెంట్‌ను తెరకెక్కిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కొత్త సినిమా.. కచ్చితంగా ఎమోషనల్‌ కనెక్టివిటీ ఉన్నదే అవుతుంది అని చెబుతున్నారు. గతంలో ఇలాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్నారు కాబట్టి ఆయన.. ఇప్పుడు కూడా ఆయన నుండి అలాంటి సినిమా, ఫలితం ఆశించొచ్చు అని చెబుతున్నారు.

పగవాడికి కూడా రాకూడదనుకునే కష్టం పడుతున్న ప్రశాంత్‌ నీల్‌.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus